Sister Execute Brother: ప్రియుడితో తిరగొద్దన్నాడు.. శవమై కనిపించాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sister Executed Brother In Jharkhand After Her Objected Her Boyfriend: అతడు సొంత తమ్ముడు.. రక్తం పంచుకుని పుట్టాడు.. తమ్ముడంటే ఆమెకు ఎంతో ఇష్టం కూడా! కానీ.. ఒక్క విషయంలో అభ్యంతరం తెలిపినందుకు ఆమె అతనిపై కోపం పెంచుకుంది. ప్రియుడితో తిరగొద్దని నిలదీసినందుకు చంపేసింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లోని రామ్ గఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. రామ్ గఢ్ జిల్లాకు చెందిన చంచల కుమారి (25) ఓ థర్మల్ పవర్ స్టేషన్లో పని చేస్తోంది. ఆ పవర్ స్టేషన్‌కు సంబంధించిన క్వార్టర్స్‌లోనే నివసిస్తోంది. ఆమెకు 21 ఏళ్ల రోహిత్ కుమార్ అనే సోదరుడు ఉన్నాడు. కొంతకాలం క్రితం చంచలకు సోను అన్సారీ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. అది ప్రేమగా మారడంలో.. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరగడం ప్రారంభించాడు. అతడు ఆమె క్వార్టర్స్‌కి తరచూ వచ్చి వెళ్తుండేవాడు.
ఈ విషయం సోదరుడు రోహిత్ కుమార్‌కి తెలిసింది. ఆ వ్యక్తి ఎవరని ఆరా తీయగా.. తన ప్రియుడని, అతని పేరు సోను అన్సారీ అని తెలిపింది. అయితే.. ఆ వ్యక్తి తమ కులం వాడు కాకపోవడంతో, ఈ సంబంధాన్ని రోహిత్ వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. అతనితో కలిసి తిరగొద్దని వారించాడు. లేదంటే తాను విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పేస్తానని బెదిరించాడు. దీంతో.. సోదరుడిపై ఆమె పగ పెంచుకుంది. తన ప్రేమకు అడ్డొస్తున్నాడని, శాశ్వతంగా అడ్డు తొలగించుకునేందుకు పన్నాగం పన్నింది. తన ప్రియుడితో కలిసి హతమార్చేందుకు స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం.. ఒక రోజు చంచల తన సోదరుడ్ని క్వార్టర్స్‌లోని ఓ రహస్య ప్రాంతానికి పిలిచింది. అక్క పిలుపు మేరకు రోహిత్ వెళ్లాడు. ఆల్రెడీ అక్కడ మాటు వేసిన సోను అన్సారీ.. రోహిత్ రాగానే అతనిపై దాడి చేశాడు. చంచల, సోను కలిసి అతడ్ని చంపేశారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా.. క్వార్టర్స్‌లోనే మృతదేహాన్ని దాచారు. అనంతరం ఏమీ ఎరుగనట్టుగా చంచల ఇంటికి వెళ్లింది.
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
తమ కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడం, ఎక్కడా జాడ కనిపించకపోవడంతో.. రోహిత్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే చంచల కుమారి క్వార్టర్స్‌లో రోహిత్ మృతదేహం లభించింది. దీంతో చంచలపై అనుమానం రావడంతో.. ఆమెను గట్టిగా నిలదీశారు. అప్పుడు తన ప్రియుడో సోనుతో కలిసి తానే తమ్ముడ్ని చంపేశానని, తమ ప్రేమకు అడ్డుగా ఉన్నందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని తెలిపింది. పోలీసులు చంచల, సోనుని అరెస్ట్ చేసి.. దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!