Site icon NTV Telugu

Shocking Ad: బంపర్ ఆఫర్.. ఏ అమ్మాయితోనైనా సెక్స్.. కేవలం వెయ్యి రూపాయలకే

Chennai

Chennai

Shocking Add: ప్రస్తుతం కాలంలో ప్రమోషన్స్ అనేవి ఎంత ముఖ్యమో ప్రత్యేకముగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వస్తువు ధర రూపాయే కావొచ్చు.. కానీ అది మార్కెట్ లోకి అడుగుపెట్టి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలంటే లక్షల్లో ప్రమోషన్స్ చేయాలి. అదే మార్కెటింగ్ స్ట్రాటజీ.. డిఫరెంట్ గా ఆలోచించినవాడే ముందుకు వెళ్తాడు అని పెద్దలు చెప్తూ ఉంటారు.. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఒక ప్రమోషన్ చూస్తే మాత్రం అందరు తిట్టుకోవడం ఖాయం.. అసలు అదేం ప్రమోషన్ అంటే.. ఒక లాడ్జి ప్రమోషన్ .. చెన్నెలోని లిటిల్ మౌంట్ లో ఒక వ్యాపారస్తుడు లాడ్జి నిర్వహిస్తున్నాడు. అతడికి కస్టమర్లు కావాలి. సాధారణంగా పిలిస్తే జనాలు రాడు అనుకున్నాడో ఏమో లాడ్జిని వ్యభిచార గృహంగా మార్చేశాడు.. ” రూమ్ కు రండి.. ఏ అమ్మాయితోనైనా సెక్స్.. కేవలం వెయ్యి రూపాయలకే” అంటూ బోర్డు పెట్టేశాడు.

ఇక ఈ బోర్డు చూసిన మహిళలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అమ్మాయిలు అంటే ఆటబొమ్మలుగా ఉందా..? అంటూ అతగాడిపై ధ్వజమెత్తారు. ఒక మహిళ ఆ బోర్డు వీడియో తీసి చెన్నై పోలీసులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసింది. చెన్నై నడిబొడ్డున ఇలాంటి బూతు ప్రకటనలు.. పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఆ బోర్డును తీయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త చెన్నైలో హాట్ టాపిక్ గా మారింది. బహిరంగంగా శృంగార ఆఫర్ ను ఇచ్చేవరకు వారు వచ్చారంటే పోలీసుల నిర్లక్ష్యమే అని, వెంటనే ఆ లాడ్జిపై చర్యలు తీసుకొని అందులో ఉన్న అమ్మాయిలను కాపాడాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version