NTV Telugu Site icon

Serial Killer: చెరుకు తోటల్లో చీరతో ఉరేసి..యూపీలో సీరియర్ కిల్లర్..? 9 మంది మహిళల హత్య..

Serial Killer In Up

Serial Killer In Up

Serial Killer: ఉత్తర్ ప్రదేశ్ బరేలీ జిల్లాలోని పలు గ్రామాల్లో వరసగా మహిళల హత్యలు సంచనలంగా మారాయి. దాదాపుగా 13 నెలల వ్యవధిలో ఒకే వయసులో ఉన్న 9 మంది మహిళలు ఒకే తరహాలో హత్య చేయబడ్డారు. దీంతో ‘సీరియల్ కిల్లర్’ ఈ హత్యలకు పాల్పడుతున్నాడనే అనుమానం కలుగుతోంది. పోలీసులు ఈ దిశగా దృష్టి సారిస్తు్న్నారు. మహిళలందర్ని ఒకే రీతిలో చీరతో గొంతుకు ఉరేసి చంపుతున్నాడు.

షాహి, షీష్‌గఢ్ మరియు షెర్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది 40-65 ఏళ్ల మధ్య వయసున్న ఎనిమిది మంది మహిళలు హత్యకు గురయ్యారు. అన్ని సమయాల్లో పొలాల్లో పనిచేస్తున్న మహిళల్ని టార్గెట్ చేశారు. చెరుకు తోటల్లో బట్టలు చింపేసిన స్థితిలో వారి మృతదేహాలు కనిపించాయి. అయితే, అత్యాచారానికి సంబంధించి ఎలాంటి సంకేతాలు కనిపంచలేదు. ఈ హత్యల్లో మహిళలు కట్టుకున్న చీరతోనే గొంతుకు బిగించి హత్య చేశారు. గతేడాది జూన్‌లో వరుసగా మూడు హత్యలు జరిగాయి, జూలై, ఆగస్టు మరియు అక్టోబర్‌లలో ఒక్కొక్కటి మరియు నవంబర్‌లో రెండు హత్యలు జరిగాయి.

Read Also: Kaalam Raasina Kathalu: పునర్జన్మలు- పరువు హత్యలు.. ఆసక్తికరంగా కాలం రాసిన కథలు ట్రైలర్

8 హత్యల తర్వాత, 300 మంది పోలీసులతో 14 ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. యూనిఫాంతో పాటు సివిల్ డ్రెస్సుల్లో సంచరిస్తూ పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీస్ నిఘా పెరిగిన తర్వాత ఏ హత్య కూడా జరగలేదు. నిందితుడు పట్టుబడనప్పటికీ 7 నెలల పాటు ఎలాంటి హత్య జరగలేదు. అయితే, ఈ ఏడాది జూలై నెలలో 45 ఏళ్ల అనిత అనే మహిళని ఇదే విధంగా చీరతో గొంతు నులిమి పొలంలో హత్య చేయబడింది. షేర్‌ఘర్ లోని భుజియా జాగీర్ గ్రామానికి చెందిన అనిత ఫతేగంజ్‌లోని ఖిర్కా గ్రామంలోని తన తల్లి ఇంటికి వెళ్లింది. జూలై 2న ఇంటి నుంచి బ్యాంకుకు వెళ్లింది. ఆ తర్వాత చెరకు తోటలో శవంగా కనిపించింది.

ఈ హత్యల వెనక సీరియల్ కిల్లర్ ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తు్న్నారు. డీజీపీ దగ్గర నుంచి ఐజీలు కూడా ఈ హత్యల కేసుని పర్యవేక్షిస్తున్నారు. హత్యలు జరిగిన ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడి అనుమాతుల స్కెచ్ విడుదల చేశారు. హంతకుడిని పట్టుకునేందుకు చాలా టీమ్‌లు గాలిస్తు్న్నాయి. పెట్రోలింగ్, చెక్‌పోస్టులని ఏర్పాటు చేశారు. గ్రామాల్లో హెచ్చరిక బోర్డుల్ని ఏర్పాటు చేసి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా వివరాలు తెలిస్తే బరేలీలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సౌత్) కార్యాలయానికి 9554402549 మరియు 9258256969 నంబర్లకి కాల్ చేయాలని కోరారు.

Show comments