Site icon NTV Telugu

ఇద్దరిని మింగేసిన సెప్టిక్ ట్యాంక్… మరొకరి పరిస్థితి సీరియస్

సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీల మృతి చెందడం హైదరాబాద్‌లో విషాదం నింపింది. కొండాపూర్‌ గౌతమి ఎన్‌క్లేవ్‌లో ఈ ఘటన జరిగింది. సెప్టిక్ ట్యాంక్ లో దిగారు నలుగురు కార్మికులు. సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ శ్రీను, ఆంజనేయులు అనే ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. గౌతమి ఎన్‌క్లేవ్‌లోని అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు తొలుత ఇద్దరు కూలీలు దిగారు. కాసేపటికి వారికి ఊపిరాడక అందులోనే చనిపోయారు.

విషవాయువులు వెలువడటంతో చనిపోగా ..ఇది గమనించి లోపలికి దిగిన వెంటనే బయటకు వచ్చారు మరో ఇద్దరు కార్మికులు. ఓ కార్మికుడి పరిస్థితి విషమంగా వుంది. మరో కార్మికుడికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు జాను
స్వామి అనే కార్మికులు. వీళ్లంతా సింగరేణి కాలనీ చంపాపేట్ వాసులుగా చెబుతున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version