Site icon NTV Telugu

Sangareddy Vidya : పేరుకే విద్య.. లోపలంతా వైవిద్యమే.. మీరు చూస్తే షాక్‌ కావాల్సిందే..!

Vidya

Vidya

Sangareddy Vidya : సంగారెడ్డి జిల్లా మరోసారి సంచలనానికి కేంద్రబిందువైంది. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని చెప్పి కోట్ల రూపాయలు దోచుకున్న విద్య అనే మహిళపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు న్యాయం కోసం ఎస్పీ కార్యాలయం ఎదుటకు చేరడంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. విద్య తన పరిచయాలను వాడుకుని పలు వ్యాపారులు, వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించింది. బంగారం తక్కువ ధరకే అందిస్తానని చెప్పి 18 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. బాధితులు డబ్బులు అడగగానే ఈ నెల 9న ఇంటికి పిలిచి అనుచరులతో దాడి చేయించినట్టు ఆరోపిస్తున్నారు.

World Cup 2027: రోహిత్, విరాట్ మాత్రమే కాదు.. మరో ముగ్గురు కూడా ప్రపంచకప్‌లో ఆడడం డౌటే?

“పటాన్‌ చెరు పోలీసులు పట్టించుకోవడం లేదు.. నిందితులను పట్టుకుని వదిలేశారు” అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నేరుగా జిల్లా ఎస్పీ పరితోష్‌ పంకజ్ కు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తుండటంపై ప్రశ్నలు లేవుతున్నాయి. ఇది ఒక్క కేసు మాత్రమే కాదు. చిత్తూరు జిల్లాలో కూడా ఇదే పద్ధతిలో 10 కోట్ల రూపాయల వరకు మోసం చేసినట్లు బయటపడింది.

ఏపీలోని ఓ ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ ప్రభావశీలులమని చెప్పి నమ్మకాన్ని పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్లు, వ్యాపారస్తులు, పోలీసులు కూడా ఆమె మోసానికి గురైనట్టు తెలుస్తోంది. విద్య తన మోసాల్లో ప్రేమను కూడా ఆయుధంగా వాడిందని సమాచారం. పలువురిని ప్రేమ పేరుతో మాయ చేసి, ఆర్థికంగా దోచుకున్నట్లు ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. విద్యకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్‌గా మారాయి. ఆ వీడియోలో గన్‌ పట్టుకొని ఉన్న వీడియో, మరో ఆశ్లీల వీడియో ఉండటం గమనార్హం.

AP Fake Liquor Case: నకిలీ మద్యం కేసు బిగ్‌ ట్విస్ట్.. బయటపడుతున్న జనార్ధన్ లింక్‌లు.. !

Exit mobile version