Site icon NTV Telugu

Uttarpradesh: ఉపాధ్యాయురాలిపై యాసిడ్ దాడి.. ఎందుకో తెలుసా..

Untitled Design (5)

Untitled Design (5)

ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ జిల్లాలో దారుణం జరిగింది. సెప్టెంబర్ 23న నఖాసా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక ఉపాధ్యాయురాలిపై యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ పోసిన వ్యక్తిని, అతనికి సహకరించిన మరో మహిళనను అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిషు అనే నిందితుడు యాసిడ్ యాసిడ్ దాడి చేసినట్లు ఎస్పీ కృష్ణ కుమార్ విష్ణోయ్ తెలిపారు. మోడీ నగర్ నివాసి డాక్టర్ అర్చన అలియాస్ జాన్వీని ఒక సంవత్సరం క్రితం నిషును కలిసినట్లు వెల్లడించారు. జాన్వి తన భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చి నిషుతో చాలాసార్లు పారిపోయింది. విభిన్న పాత్రలను పోషించడానికి ఆమె ముఖంలోని పుట్టుమచ్చను కూడా తొలగించుకుంది. ఆమె కొన్నిసార్లు డాక్టర్ అర్చనగా , కొన్నిసార్లు జాన్విగా మారడానికి తన ముఖాన్ని మార్చుకునేది. నిషు గతంలో మదర్ డైరీలో కెమిస్ట్‌గా పనిచేశాడు. అక్కడి నుండి యాసిడ్ తెచ్చి బాధితురాలిపై పోసినట్లు పోలీసులు తెలిపారు.

జాన్వి అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో నిషుతో స్నేహం చేసి అతన్ని ప్రేమ ఉచ్చులోకి నెట్టింది. జాన్వికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వివాహం తర్వాత, ఆమెకు ఉపేంద్రతో ప్రేమ వ్యవహారం ఉంది. ఆమె అతన్ని వివాహం చేసుకోవాలనుకుంద. కానీ నిజం తెలుసుకున్న ఉపేంద్ర ఆమెకు దూరమయ్యాడు. ప్రతీకారం తీర్చుకోవడానికి, జాన్వి నిషును ఇరికించి తన మాజీ ప్రియుడి కాబోయే భార్యపై యాసిడ్ దాడికి కుట్ర పన్నింది.”

“ఉపేంద్ర ఆర్మీలో ఉన్నారని.. ప్రస్తుతం కోల్‌కతాలో పనిచేస్తున్నారని డాక్టర్ అర్చన తనకు చెప్పినట్లు నిషు తెలిపాడు. ఉపేంద్ర భావన అనే టీచర్ ను పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి.. తనపై దాడి చేసేందుకు కుట్ర పన్నారు.. సెప్టెంబర్ 23న, నిషు తన స్కూటర్‌పై వస్తున్న ఉపాధ్యాయురాలు భావనపై యాసిడ్ పోసి పారిపోయాడు.

యాసిడ్ దాడి తర్వాత, పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు. గురువారం రాత్రి, నిందితుడు నిషును చెక్‌పాయింట్ సమయంలో ఆపినప్పుడు, అతను కాల్పులు జరిపాడు. పోలీసులు తిరిగి కాల్పులు జరపడంతో నిందితుడి రెండు కాళ్లకు గాయాలయ్యాయి. నిందితుడిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. బాధితురాలు, ఉపాధ్యాయురాలు కూడా చికిత్స పొందుతోంది. యాసిడ్ దాడిలో ఉపాధ్యాయురాలికి 30% కాలిన గాయాలు అయ్యాయి, ఆమె ముఖం మరియు కడుపుపై ​​గాయాలయ్యాయి” అని పోలీసు సూపరింటెండెంట్ కృష్ణ కుమార్ విష్ణోయ్ అన్నారు.

थाना नखासा पुलिस द्वारा महिला शिक्षिका पर ज्वलनशील पदार्थ फेंकने वाले अभियुक्त की पुलिस मुठभेड़ व अभियुक्त की महिला साथी की गिरफ्तारी के सम्बन्ध में #SPSambhal @Krishan_IPS की बाइट।#UPPolice #GoodWorkUPP https://t.co/qDUyIlcbjC pic.twitter.com/AbjaZFRw17
— SAMBHAL POLICE (@sambhalpolice) September 26, 2025

Exit mobile version