NTV Telugu Site icon

Wife Harassment: “ఏది కావాలంటే అది చేయండి, కానీ పెళ్లి చేసుకోకండి”.. కంటతడి పెట్టిస్తున్న వ్యక్తి ఆత్మహత్య..

Man Hangs Self

Man Hangs Self

Wife Harassment: భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెడుతున్న వేధింపులు తాళలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్న వీడియోని రికార్డ్ చేశాడు. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తాను పెళ్లి వల్ల ఎంత నరకం అనుభవించానే విషయాన్ని చెబుతూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కంటనీరు తెప్పిస్తోంది. “దునియా మే కుచ్ భీ కర్ లేనా, పర్ షాదీ మత్ కర్నా (జీవితంలో మీకు ఏది కావాలంటే అది చేయండి, కానీ పెళ్లి చేసుకోకండి)” అని పేర్కొంటూ ఎప్పటికీ పెళ్లి చేసుకోవద్దని కోరుతూ ఆ వ్యక్తి తీవ్ర చర్యకి పాల్పడే ముందు వీడియోను రికార్డ్ చేశాడు.

Read Also: IC 814 The Kandahar Hijack: IC 814 హైజాక్ సిరీస్‌లో రెండు తప్పులు: రియల్ పైలట్ కెప్టెన్ దేవీ శరణ్..

ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద్ షహర్‌లోని నర్సైన ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధితుడిని జగ్జిత్ సింగ్ రాణాగా గుర్తించారు. ఒక ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటూ, మెడికల్ సప్లై వ్యాపారం చేస్తు్న్నాడు. భార్య, అత్తామామల వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురై అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు తన మొబైల్ ఫోన్‌లో రెండు వీడియోలు రికార్డ్ చేశారు. వీడియోలో.. జగ్జిత్ తన అత్తమామల వల్ల ప్రాణహాని ఉందని, వారు తనను బలవంతంగా ఆత్మహత్యకు పాల్పడేలా చేస్తున్నారని ఆరోపించారు. మూడు నిమిషాల నిడివి కలిగిన వీడియోలో తన బులంద్ షహర్ జిల్లాలో ఓ గ్రామంలో తన అత్తామమాలు నివాసం ఉంటున్నారని పేర్కొన్నాడు. తాను అన్నీ తెలిసే ఈ చర్యకు పాల్పడుతున్నానని, వాట్సాప్ ద్వారా వీడియో పంపుతున్నానని చెప్పాడు.

‘‘భార్య, అత్తామామల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని వీడియోలో పేర్కొన్నాడు. వారు పెట్టే వేదనను వర్ణించలేనని చెప్పారు. ‘‘వాళ్లకి వాటా ఇవ్వను, నా మోహం చూపించను’’ అని బాధతో చెప్పారు. జగ్జీత్ సింగ్ రాణా మరణానికి ముందు ఎంత ఒత్తిడికి లోనయ్యాననే విషయాన్ని ఈ వీడియో వెల్లడించింది. ఆ వ్యక్తులకు తన మోహాన్ని చూపించొద్దని, పోలీసులు-అధికార యంత్రాంగం తన అంత్యక్రియలు చేయాలని ఆయన అభ్యర్థించారు. రెండో వీడియోలో రాణా ఉరివేసుకోవడం కనిపిస్తుంది. ‘‘జీవితంలో మీకు ఏది కావాలంటే అది చేయండి , కానీ పెళ్లి చేసుకోకంది..జైశ్రీరాం’’ అంటూ జీవితాన్ని ముగించాడు. ఈ కేసుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై చర్యల తీసుకునే ముందు సింగ్ కుటుంబీకుల ఫిర్యాదు కోసం ఎదురుచూస్తున్నారు.

Show comments