NTV Telugu Site icon

Road Accident: ఖైరతాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ ను ఢీకొట్టిన కారు..

Road Accident

Road Accident

Road Accident: ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖైరతాబాద్ నుంచి బంజారా హిల్స్ వైపు అతి వేగంగా వెళుతున్న న్యూ బీఎండబ్ల్యూ కారు డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఇద్దరికి తీవ్ర గాయాలు బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఉదయం 7.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Read also: Dengue Fever: డెంగ్యూ రాకూండా ఈ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

బంజారా హిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కారు ప్రమాద సమయంలో జితేష్ బుగాని అనే యువకుడు కారును నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జితేష్ బుగాని తండ్రి ఓ ఉన్నతాధికారి అని సమాచారం. ఖైరతాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో కారు ప్రమాదం జరిగిందా? లేదా నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read also: Nani : వామ్మో.. అక్కడ నాని సినిమాకు కలెక్షన్స్ మాములుగా లేవుగా

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం బైపాస్ యమ్మీ హోటల్ వద్ద ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి నాగర్ కర్నూల్, మహబూబ్ నాగర్ వైపు వెళుతున్న మూడు కార్లు డీ కొన్నాయి. ముందు కారు సడెన్ బ్రేక్ చేయడంతో ప్రమాదం జరిగింది. ఎవరికి ఎలాంటి అపాయం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం వల్ల కొంటామేరా ట్రాఫిక్ కు అంతరాయం జరిగిందని తెలిపారు.

Read also: Top Headlines @9AM: టాప్ న్యూస్!

కాపుగల్లు క్రాస్ రోడ్ వద్ద అర్ధరాత్రి రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన మరోవైపు సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో జరిగింది. మృతులు సుదర్శన్ (25), విజయ్(25) గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణం అతివేగమే కారణమని రూరల్ పోలీసులు తెలిపారు. మృతి చెందిన ఇద్దరిని కోదాడ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు.
Ponnam Prabhakar: కలకత్తా ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది…

Show comments