NTV Telugu Site icon

Road Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Road Accident

Road Accident

Road Accident In Jubilee Hills Road No 3: న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉదయం 5.30 గంటల సమయంలో బంజారాహిల్స్ రోడ్ నం. 3లో మూడు కార్లు ఢీకొన్నాయి. అతివేగంగా వస్తున్న ఒక కారు అదుపు తప్పి, ఆగి ఉన్న మరో రెండు కార్లను ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో.. అటుగా నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. గాయపడిన వారిని దగ్గరలోనే ఉన్న ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు.

Earthquake: హర్యానాలో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు

ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే.. కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. టైర్లు విడిపోయి, దూరంగా వెళ్లి పడ్డాయి. కార్లలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. ఒక కారు వేగంగా గుద్దడంతో.. నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు పది అడుగుల పైకి ఎగిరి, ఎదురుగా ఉన్న ఒక షాప్ ఫ్లెక్సీతో ఢీ కొట్టారు. దీంతో వాళ్లు ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిద్ర మత్తు వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేక మద్యం మత్తులోనా? అనే విషయంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. చనిపోయిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? అనే వివరాల్ని ఆరా తీస్తున్నారు.

Malavika Sharma : బ్లాక్ డ్రెస్‌లో బోల్డ్‌ నెస్‌ పెంచి.. మైండ్‌ బ్లాక్‌ చేస్తోందిగా