Site icon NTV Telugu

Road Accident: మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదాలు మామూలైపోయాయి. మితిమీరిన వేగం, కొద్దిపాటి నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మేడ్చల్ జిల్లాలో చెక్ పోస్ట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు మరణించారు. అదుపు తప్పి డివైడర్ ని గుద్దుకుంది మారుతీ ఈకో వాహనం. ఈ వాహనంలో తొమ్మిది మంది ఉన్నట్లు సమాచారం. అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా మరొకరు హాస్పిటల్ తరలిస్తుండగా ఇంకొకరు మృతిచెందారు.

https://ntvtelugu.com/one-woman-raped-due-to-nude-chating-in-whatsapp/

ఈ ప్రమాదంలో మరణించినవారిని గోరి సింఘ్, బబ్లీ సింఘ్ గా గుర్తించారు. మేడ్చల్ ప్రాంతంలో బతుకు దెరువు కోసం వచ్చిన కూలీలుగా పోలీసులు చెబుతున్నారు. వీరంతా మధ్యప్రదేశ్ చెందిన వారుగా గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను, ఒకరిని మేడ్చల్ ప్రభుత్వ హాస్పిటల్ కి, మరొకరిని గాంధీకి తరలించారు పోలీసులు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో కారు డివైడర్ ని ఢీకొంది. మేడ్చల్ నుండి సుచిత్ర కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Exit mobile version