ఈమధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు కామన్ అయిపోయాయి.. హైదరాబాద్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ర్యాపిడో రైడర్ దుర్మరణం పాలయ్యాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాపిడో బైక్ రైడర్ మృతి చెందగా, బైక్ వెనుక వున్న ప్రయాణికుడు గాయాల పాలయ్యాడు. టోలీచౌకి కు చెందిన యం.డి. రిజ్వాన్ రాపిడో రైడర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. నానక్ రామ్ గూడా నుంచి మణికొండ వైపు కస్టమర్ ను తీసుకోపోతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Read Also: Prabhas: ప్రభాస్‌కు అరుదైన గౌరవం.. సౌతిండియాలోనే ఈ అవకాశం దక్కించుకున్న తొలి హీరో
ఖాజాగుడా దగ్గర యూటర్న్ తిసుకుంటుండగా వేగంగా వచ్చిన కారు వీరి బైక్ ని ఢీకొంది. దీంతో బైక్ మీద నుంచి రిజ్వాన్ కింద పడి తలకు తివ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కస్టమర్ శ్రీనివాస్ కు గాయాలయ్యాయి. అతడిని గచ్చిబౌలి లోని ప్రైవేటు హస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు….ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు రాయదుర్గం పోలీసులు.
Read Also: Deputy CM Narayana Swamy: అది రైతుల యాత్ర కాదు.. కోటీశ్వరుల యాత్ర
