The Husband: ప్రస్తుతం కాలంలో పెళ్లి చేసుకోవాలంటేనే మగాళ్లు భయపడుతున్నారు. పెళ్లి చేసుకుంటే, భార్య లవర్ చేతిలో హత్యకు గురవుతామో అనే భయం కూడా కొందర్ని వెంటాడుతోంది. మరికొందరు మాత్రం, చాలీచాలని జీతంతో పెళ్లి చేసుకోవడం అవసరమా..? అని భావిస్తున్నారు. భార్యలు, అత్తమామల ఖరీదైన కోరికలు తీర్చడానికి జంకుతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా భార్య లగ్జరీ కోరికలు తీర్చేందుకు ఓ వ్యక్తి పూర్తి స్థాయిలో దొంగగా మారాడు.
ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. తన భార్య ఖరీదైన కోరికలు తీర్చలేక, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ) చదివిని ఓ వ్యక్తి, పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఉద్యోగం మానేసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. తరుణ్ పరీక్ అనే వ్యక్తిని వివాహం జరిగిన నెల రోజులకే పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య డిమాండ్లను తీర్చడానికి నేర మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.
జంవారాంగర్ గ్రామంలో నివసించే తరణ్ దొంగతనాలు చేయడానికి జైపూర్ వెళ్లేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా తన నేరాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. భార్య డబ్బులు, విలాసవంతమైన జీవనశైలి కోసం ఒత్తిడి తెచ్చేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒత్తిడికి లొంగిన తరుణ్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాన్ని వదులుకుని, తన భార్య డిమాండ్లను తీర్చడానికి దొంగగా మారాడు.
జైపూర్‌లోని ట్రాన్స్‌పోర్ట్ నగర్ ప్రాంతంలో ఇటీవల జరిగిన గొలుసు దొంగతనం సంఘటనలో అతను పాల్గొన్నాడు. ఒక వృద్ధ మహిళ నుండి బంగారు గొలుసును లాక్కున్నాడు. ఈ సంఘటన తర్వాత, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, తరుణ్‌ని గుర్తించారు. అతని స్వగ్రామం, జైపూర్ మధ్య కదలికల్ని ట్రాక్ చేసి శుక్రవారం అతడిని అరెస్ట్ చేశారు.
