మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని రకాల కొత్త చట్టాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నా కూడా కామాంధుల ఆగడాలు తగ్గడం లేదు.. అంతకు అంత రెచ్చిపోతున్నారు.. ఇటీవల ఆగంతకులు అపహారించి అత్యాచారం చేస్తే ఇప్పుడు అయిన వాళ్ళే వరుసగా లైంగిక దాడులు చేస్తున్నారు.. నిన్న బాబాయి కూతురు జీవితాన్ని నాశనం చేస్తే, ఈరోజు అతి కిరాతకంగా కన్న తండ్రే దారుణంగా రేప్ చేసిన ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది..రాజస్థాన్ లోని దుంగార్‌పూర్ జిల్లా, బిచివారా ప్రాంతంలో మైనర్ బాలికపై ఆమె తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు..
ఈ ఘటన గత నెల జరిగిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. మే 29న బాలిక తల్లి బిచ్చివార పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఓ వివాహ వేడుకకు హాజరైన బాలిక బంధువుల ఇంటి నుంచి తండ్రితో కలిసి ఇంటికి వస్తుండగా ఈ దారుణానికి ఒడిగట్టాడు ఆ దుర్మార్గుడు… ఈ విషయం తల్లికి తెలియడంతో బాలికను తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దాంతో ఈ విషయం బయటకు వచ్చింది..తన భర్త గుజరాత్‌లో కూలీగా పనిచేస్తున్నాడని, తన కూతురు బిచివారాలో తనతో ఉంటోందని తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మే 29న ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు నిందితుడు గ్రామానికి వచ్చాడు. కూతురితో కలిసి వేడుకకు వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తుండగా, అతను ఒక నిర్జన ప్రదేశంలో ఆమెపై అత్యాచారం చేశాడు..
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న విజయ్..?క బాలిక ఎలాగో ఇంటికి చేరుకుంది..విషయాన్ని తల్లికి చెప్పింది..దిగ్భ్రాంతికి గురైన ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.ఇదిలా ఉండగా..ఓ కన్న తండ్రి కసాయిలా మారాడు.. కామాంధుడై కూతురి మీదే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ కీచక తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి (37) కూతురు ఆ ప్రాంతంలోనే ఉన్న ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుకుంటుంది. కూతురిని ప్రేమగా చూసుకోవాల్సిన తండ్రి ఆమె మీద కన్నేసాడు.. ఆ తర్వాత తనపై రోజూ లైంగిక దాడి చేస్తున్నాడని కూతురు తల్లితో చెప్పడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.. ఇలా ఎన్నో ఘటనలు దేశంలో జరుగుతూనే ఉన్నాయి..
