రాజస్థాన్ లోని జైపూర్ లో ఓ యువకుడు, యువతి కలిసి కార్ల చోరీకి పాల్పడ్డారు. కార్లను చోరీ చేసేందుకు.. వారు పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. నేరస్థులు.. ఇద్దరు లవర్స్ అని.. యువతి నర్సింగ్ చదువుకుందని.. జల్సాల కోసం… చోరీలకు అలవాటు పడ్డారని పోలీసులు వెల్లడించారు.
Read Also: Health Tips: ఉదయాన్నే గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్ పాలో అవ్వండి
జైపూర్‌లో జరిగిన ఒక సంఘటన ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. పంజాబ్ నుండి వచ్చిన నేరస్థులు కార్లను దొంగిలించడానికి వచ్చారు. అయితే కార్లు దొంగలించేందుకు ఓ యువకుడితో పాటు.. అతడి ప్రియురాలు కూడా వచ్చింది. అయితే.. వారు ఒక పాఠశాల ప్రిన్సిపాల్ కారును చోరీ చేశారు. దీంతో పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. కారు అడవిలో ఆపి పారిపోయాడు యువకుడు. యువతిని పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. కారులో ప్రిన్సిపాల్ పెంపుడు కుక్క కూడా ఉండడం విశేషం..
Read Also:Murder Attempt: దారుణం.. ట్రాక్టర్ లైట్ దొంగింలించాడని.. 14 ఏళ్ల బాలుడిపై ..
పూర్త వివరాల్లోకి వెళితే.. బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాంపుర ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఒక పాఠశాల ప్రిన్సిపాల్ తన డ్రైవర్‌తో కలిసి తన కారు ఎక్కబోతుండగా. డ్రైవర్ కారు స్టార్ట్ చేయగానే.. అకస్మాత్తుగా ఓ వ్యక్తి కారు ముందు సీట్లో కూర్చున్నాడు. వెనుక మరో యువతి కూర్చుంది. ఆ వ్యక్తి డ్రైవర్ ను బెదిరించి కారు తీసుకెళ్లాడు. ఈ సంఘటన మొత్తం CCTVలో రికార్డైంది.
Read Also:Old City Police Dance: డ్యాన్స్ చేసి.. ఉల్లాసంగా గడిపిన ఓల్డ్ సిటీ పోలీసులు.. వీడియో వైరల్
వెంటనే .. పోలీసులు అతడిని వెంబడించారు. యువకుడు పోలీసుల నుంచి తప్పించుకోలేక కారును ఓ అడవిలో వదిలేసి.. పారిపోయాడు. అయితే యువతి.. అందులోనే ఉండడంతో యువతిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. యువతి అతడి ప్రేమికురాలని తెలిసింది. ఇద్దరు కలిసే దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. అయితే ఆ యువతి ప్రధాన నిందితుడు.. లవ్ జిత్ స్నేహితురాలు నవ్ సిరత్ కౌర్ గా గుర్తించారు.. యువతి బీఎస్సీ నర్సింగ్ చదివిందని సమాచారం. వీరిద్దరూ కలిసే చోరీలకు పాల్పడుతున్నారని సమాచారం.
