ముషీరాబాద్ రిసాలగడ్డ వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు వచ్చిన సిబ్బందికి మృతదేహం కనిపించడంతో పోలీసులుకు, అధికారులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని పిలిపించి మృతదేహాన్ని వాటర్ ట్యాంక్ నుంచి బయటకు తీశారు. అయితే 50 అడుగుల ఎత్తున్న వాటర్ ట్యాంక్‌కు రెండు ద్వారాలు ఉన్నాయని.. ఆ రెండూ మూసే ఉన్నాయని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వాటర్ ట్యాంక్ పైన ఓ చెప్పుల జత కనిపించడంతో దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మృతి చెందిన వ్యక్తి అంబేద్కర్ నగర్ కు చెందిన కిషోర్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వాటర్ ట్యాంక్ వద్ద కనిపించిన చెప్పులను మృతుడి అక్క గుర్తించడంతో కిషోర్ అని వెల్లడించారు. కానీ వాటర్ ట్యాంక్‌పై రెండు ద్వారాలు ఉండగా.. అవిరెండూ కూడా మూసి ఉండటంతో కిషోర్‌ను ఏవరైనా చంపారా.. లేక ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
