Site icon NTV Telugu

Delhi Pooja Kumari: ప్రియుడు దూరమయ్యాడని.. 11 ఏళ్ల బాలుడిపై యువతి కిరాతకం

Delhi Pooja Kumari Crime

Delhi Pooja Kumari Crime

Delhi Pooja Kumari: ఈరోజుల్లో ప్రజల్లో నేరస్వభావం బాగా పెరిగిపోయింది. చిన్న చిన్న విషయాల్లోనూ పగలు, ప్రతీకారాలు పెంచుకొని.. హత్యలు చేసేందుకు తెగబడుతున్నారు. అసలు సంబంధం లేని వారిని సైతం వివాదాల్లోకి లాగి.. బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఓ యువతి కూడా అలాంటి దారుణానికే పాల్పడింది. తనకు ప్రియుడు దూరమయ్యాడని కోపం పెంచుకున్న ఓ యువతి.. అన్యంపుణ్యం ఎరుగని చిన్నారిని పొట్టనబెట్టుకుంది. అతడ్ని కిరాతకంగా హతమార్చింది. న్యూ ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

Cyber Crime: తస్మాత్ జాగ్రత్త.. ఆ నంబర్ నుంచి కాల్ వస్తే, అస్సలు లిఫ్ట్ చేయొద్దు

న్యూ ఢిల్లీకి చెందిన పూజ కుమారి(24) అనే యువతికి 2019లో జితేంద్ర అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కొన్ని రోజుల్లోనే అది ప్రేమగా మారడంతో.. ఇద్దరూ కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. నిజానికి.. జితేంద్రకు అంతకుముందే పెళ్లయ్యింది. అతనికి 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే.. భార్యతో విభేదాలు తలెత్తడంతో అతడు భార్యని, పిల్లాడ్ని వదిలేసి.. పూజాతో కలిసి ఉండేవాడు. వీళ్లిద్దరు కలిసి మూడు సంవత్సరాల పాటు సహజీవనం చేశాడు. ఆ తర్వాత జితేంద్ర తన మనసు మార్చుకొని.. తిరిగి భార్య, కుమారుడి వద్దకు వెళ్లిపోయాడు. వారితోనే కలిసి జీవించసాగాడు. పూజా కుమారికి ఇది ఏమాత్రం నచ్చలేదు. ప్రియుడు తనని మోసం చేసి వెళ్లిపోయాడని.. జితేంద్రపై కోపం పెంచుకుంది. అతనికి బుద్ధి చెప్పాలని అనుకుంది.

Mobile Number: ఓ వివాహిత ప్రాణం తీసిన కొత్త నంబర్.. అసలేం జరిగిందంటే?

తన ప్రియుడు జితేంద్ర ఇంద్రపురి కాలనీలో ఉంటాడని తెలుసుకున్న పూజాకుమారి.. ఆగస్టు 10వ తేదీన అక్కడికి వెళ్లింది. ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో.. లోపలికి వెళ్లింది. ఇంట్లో ఎవరు లేరు. జితేంద్ర కుమారుడు దివ్యాంశ్ (11) ఒక్కడే నిద్రిస్తున్నాడు. అదే అదునుగా భావించిన పూజా.. దివ్యాంశ్‌ని చంపేసి, అక్కడే ఉన్న ఓ పెట్టెలో మృతదేహాన్ని పెట్టి, అక్కడి నుంచి పారిపోయింది. ఇంట్లో తమ కుమారుడు కనిపించకపోవడంతో.. జితేంద్ర, అతని భార్య ఎంతో వెతికారు. చివరికి పెట్టెలో శవమై కనిపించడంతో షాక్‌కి గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాళ్లు 300 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, ఈ హత్య చేసింది పూజానే అని నిర్ధారించి, ఆమె ఎక్కడుందో జల్లెడ పట్టి, మూడు రోజుల తర్వాత అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version