రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. కేసులో ప్రధాన నిందితుడు ఏ-1 సాదుద్దీన్‌ను చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారించాల్సి ఉన్నందున సాదుద్దీన్ మాలిక్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరగా.. న్యాయస్థానం 4 రోజులు అనుమతిచ్చింది. సాదుద్దీన్‌ను జూబ్లీహిల్స్ పీఎస్‌లోని ప్రత్యేక గదిలో బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ విచారిస్తున్నారు.
Jubilee hills Case: జూబ్లీహిల్స్ రేప్ కేసులో పోలీసుల సంచలన నిర్ణయం
అత్యాచారానికి సహకరించిన ఇతర నిందితుల గురించి ఆరా తీస్తున్నారు. తప్పించుకునేందుకు నిందితులు చేసిన ప్రయత్నాల గురించి తెలుసుకుంటున్నారు. ఇన్నోవా వాహనం విషయంలో కార్పొరేటర్ పాత్రపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. సాదుద్దీన్‌ను ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్న పోలీసులు.. అత్యాచార ఘటనను సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. పబ్‌లో జరిగిన ఘటన బాలికను ట్రాప్ చేసిన అంశాలపై అతడిని విచారించనున్నారు. కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేశారు. అందులో ఐదుగురు మైనర్లు కాగా.. సాదుద్దీన్ మాత్రమే మేజర్.