Hyderabad: హైదరాబాద్ నగరంలోని మియాపూర్ దీప్తి శ్రీనగర్ లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్పందన మాజీ ప్రియుడే హత్య చేసినట్లు తెలింది. మియాపూర్ సీబీఆర్ ఎస్టేట్లో స్పందన హత్యకు గురైన తర్వాత సీసీటీ పుటేజ్ ఆధారంగా మర్డర్ చేసింది మందల మనోజ్ కుమార్ (బాలు) గుర్తించారు. అయితే, మనోజ్- స్పందన ఇద్దరు ఓ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఇద్దరు క్లాస్ మేట్స్ కావడంతో స్పందనపై మనోజ్ ఇష్టం పెంచుకున్నాడు. మధ్యలో తనకు పెళ్లి కావడంతో మనస్థాపానికి గురైన మనోజ్(బాలు).. స్పందన భర్తతో వివాదాలు కావడంతో దూరంగా ఉంటున్న ఆమెపై నిందితుడు ప్రేమ పెంచుకున్నాడు. ఇక, తనను ప్రేమించమంటూ పలుమార్లు స్పందనపై మనోజ్ ఒత్తిడి చేశాడని పోలీసుల విచారణలో తేలింది.
Read Also: Posani Krihsna Murali : కొండా సురేఖ – అక్కినేని వివాదం.. పోసాని కృష్ణమురళి షాకింగ్ కామెంట్స్
ఇక,స్పందన తన ప్రేమను తిరస్కరించడంతో తట్టుకోలేక పోయినా మనోజ్ (బాలు).. తనను పట్టించుకోకుండా ఇతరులతో స్పందన స్నేహంగా ఉండటం చూసి తట్టుకోలేక పోయిన మనోజ్.. ఆమెపై పగను పెంచుకున్నాడు. ఇక, సీబీఆర్ ఎస్టేట్ వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్లకు చొరబడి స్క్రూ డ్రైవర్, బండరాయితో ఆమె మొహంపై దాడి చేసి హత్య చేశాడు. కాగా, కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు మనోజ్ చంపినట్టుగా గుర్తించారు. అతడ్ని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.