జూబ్లీహిల్స్ రేప్ కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేప్ కేసు నిందితులను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును పోలీసులు కోరారు. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత ట్రయల్ జరిగే సమయంలో ఐదుగురిని అడల్ట్‌లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్‌కు హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
పోలీసుల విజ్ఞప్తిపై జువైనల్ జస్టిస్‌దే తుది నిర్ణయం కానుంది.
Jubilee hills Case: NTV చేతిలో బాధితురాలి రెండో స్టేట్‌మెంట్.. సంచలన విషయాలు
మైనర్ల మానసిక స్థితి, నేరం చేయడానికి వారికి ఉన్న సామర్థ్యం అన్నింటినీ పరిగణలోకి తీసుకుని జువైనల్ జస్టిస్ నిర్ణయాన్ని వెల్లడించనుంది. కాగా… మైనర్లకు 21 యేళ్లు దాటిన తరువాత వారిని జువైనల్ హోం నుంచి సాధారణ జైలుకు తరలిస్తారన్న విషయం తెలిసిందే. మరోవైపు ఏ-1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను ఇవాళ్టి నుంచి ఈ నెల 11 వరకు మూడు రోజుల పాటు జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. నేడు చంచల్ గూడ జైలు నుంచి సాదుద్దీన్‌ను కస్టడీలోకి తీసుకోనున్నారు.