ఆమె వయస్సు 22.. ఒక కాలేజ్ లో డిగ్రీ చదువుతోంది. కొన్ని రోజుల క్రితం ఆమెపై అత్యచారం జరిగింది. కొంతమంది వ్యక్తులు ఆమెను బలవంతంగా లకెత్తి అత్యాచారం చేశారు. దీంతో ఆమె న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. తనను అత్యచారం చేశారని , వారిని ఎలాగైనా పట్టుకొని శిక్షించాలని పోలీసులను కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి బాధిత యువతినే అరెస్ట్ చేశారు. అదేంటి.. అలా ఎలా చేస్తారు అనేగా డౌట్. ఎందుకంటె ఆ యువతీ ఆడింది మొత్తం డ్రామా. పలువురు మగాళ్లను హానీ ట్రాప్ చేసి వారి వద్ద నుంచి డబ్బులు గుంజుతూ.. డబ్బులు ఇవ్వని వారిపై ఫేక్ రేప్ కేసులు పెట్టడం ఆమెకు అలవాటు. ఇక తాజాగా యువతిని పోలీసులు అరెస్ట్ చేయడంతో విషయం హాట్ టాపిక్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన 22ఏళ్ల యువతి డిగ్రీ చదువుతూ తల్లితో కలిసి నివసిస్తోంది. వారం రోజుల క్రితం యువతీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి దాదాపు 8 మంది తనపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా వారిని వదలకుండా శిక్ష వేయాలని కోరింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు యువతి ఫిర్యాదుమేరకు స్పందించి విచారణ చేపట్టగా యువతి గురించిన షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. కొన్నేళ్లుగా ఆ యువతి హానీ ట్రాప్ చేస్తూ ఎంతోమంది మగవారి వద్ద డబ్బు గుంజిందని , ఆమె మాట వినకుండా డబ్బు ఇవ్వనివారిపై రేప్ కేసు పెట్టి వారి పరువు తీస్తుందని తెలుసుకున్నారు. దీంతో వెంటనే ఆ యువతిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా.. ఆ 8 మంది తన వలలో పడలేదని, తన గురించి ఎక్కడ నిజం చెప్తారో అని భయపడి ఈ ప్లాన్ వేసినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం యువతిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కి తరలించారు.
