Site icon NTV Telugu

కిలేడి ఆట కట్టించిన హైదరాబాద్‌ పోలీసులు..

నేటి సమాజంలో మోసాలు పెరిగిపోయాయి. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి మంచి పనులు చేస్తుంటే.. మరి కొందరు మాత్రం టెక్నాలజీని వాడి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. గుజరాత్‌ అహ్మదాబాద్‌కు చెందిన హేమలి అనే మహిళ ఇతర వ్యక్తులను వాట్సాప్‌ డీపీగా పెట్టుకొని.. వారికి సంబంధించిన వారికి మెడికల్‌ ఎమర్జేన్సీ అని చెప్పి డబ్బులు కావాలంటూ మెసేజ్‌లు పెట్టేది.

అయితే తెలిసిన వ్యక్తి ఆపదలో డబ్బు సహాయం అడుగుతున్నారని వారు కూడా డబ్బులు పంపేవారు. ఇలా రూ.2లక్షలు మోసపోయిన హైదరాబాద్‌ గోల్కొండకు చెందిన లవ్లీన్‌ కుమార్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులును ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అకౌంట్‌ డీటెయిల్స్‌ ఆధారంగా హేమలిని ఆటకట్టించారు. ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Exit mobile version