రన్ వే పై ఉన్న విమానం ఎమర్జెన్సీ డోర్ తీసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. దీంతో ఇతర ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. భద్రతా సిబ్బంది.. ఆ ప్రయాణికుడి విచారించేందుకు బలవంతంగా.. అతడిని ఫ్లైట్ నుంచి దింపేశారు. దీంతో విమానం గంట ఆలస్యంగా బయలు దేరింది.
Read Also: Wife Brutally Kills Husband: ఇదేందమ్మా ఇది. . బీడీ కాల్చినందుకు భర్తను దారుణంగా హత్య చేసిన భార్య
పూర్తి వివరాల్లోకి వెళితే.. సోమవారం లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో వారణాసి నుండి ముంబైకి ఆప్రాన్ ద్వారా వెళ్తున్న విమానం యొక్క అత్యవసర గేటును తెరవడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అతను అలా ఎలా ఎందుకు చేశాడో.. ప్రయాణీకులకు అర్థం కాలేదు. దీంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. దీనిని చూసిన సిబ్బంది ఒకరు ప్రయాణికుడిని ఆపి పైలట్ కు సమాచారం అందించారు. పైలట్ వెంటనే ATC ని సంప్రదించి విమానాన్ని తిరిగి ఆప్రాన్ కు తీసుకువచ్చాడు.
Read Also: Fake Agniveer: అగ్నివీర్ సైనికుడు అని చెప్పుకుంటూ.. ప్రయాణీకుల బ్యాగుల చోరీ.. వ్యక్తి అరెస్ట్
జౌన్‌పూర్‌లోని గౌరా బాద్‌షాపూర్ నివాసి అయిన ప్రయాణీకుడు సుజిత్ సింగ్ విమానం అత్యవసర తలుపు తెరవడానికి ప్రయత్నించాడని ఎయిర్ పోర్ట్ సిబ్బంది వెల్లడించింది. సిబ్బంది వెంటనే పైలట్‌కు సమాచారం అందించడంతో.. . పైలట్ ATCని సంప్రదించి విమానాన్ని వెనక్కు తీసుకువచ్చాడన్నారు. ఆప్రాన్ లోకి ఎక్కిన తర్వాత భద్రతా సిబ్బంది అతడిని బలవంతంగా కిందికి దింపి ప్రశ్నించింది. అనంతరం విమానాన్ని కూడా తనిఖీ చేశారు అధికారులు. దీంతో విమానం దాదాపు గంటసేపు ఆలస్యమైంది.
