పెళ్లి జరిగిన రెండు గంటలకే సూరత్‌కు చెందిన వధువుకి, వరుడు నగలు ఇవ్వకపోవడంతో వివాదం మొదలైంది.. వరుడు నిజం దాచిపెట్టి .. పెళ్లి చేసుకున్నాడని వధువు తరఫు బంధువులు ఆరోపించారు. ఈ సంబంధం షాదీ.కామ్ అనే ఆన్ లైన్ మ్యారేజ్ బ్యూరోలో సెట్ అయ్యింది. పెళ్లి అయిన రెండు గంటలకే రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి సంబంధం రద్దు చేసుకున్నారు. నగల విషయంలో గొడవ రావడంతో .. పెళ్లి కొడుకుపై దాడి చేసింది వధువు కుటుంబం. రాత్రంతా అతడిని బంధించి.. పెళ్లి ఖర్చులన్ని ఇవ్వాలని డిమాండ్ చేసింది.
Read Also: Increase: మొబైల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరగనున్న రీఛార్జ్ ధరలు..
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ మధురలోని హోలీ గేట్ ప్రాంతంలో వరుడు, వధువు కుటుంబానికి మధ్య నగల విషయంలో గొడవ జరిగింది. సూరత్ నుండి తమ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన వధువు కుటుంబం నాలుగు రోజులుగా మధుర హోలీ గేట్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో బస చేసింది. ఆదివారం, కాన్పూర్ నివాసి అయిన వరుడు వివాహ ఊరేగింపుతో వచ్చాడు. వివాహ ఆచారాలన్నీ పూర్తయ్యాయి.
Read Also:Wife Brutally Kills Husband: ఇదేందమ్మా ఇది. . బీడీ కాల్చినందుకు భర్తను దారుణంగా హత్య చేసిన భార్య
ఈ విషయంపై వధువు కుటుంబం వరుడి తల్లిని అడిగినప్పుడు.. తాము నగల గురించి చర్చించలేదని ఆమె చెప్పింది. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా మధురలోని ఒక హోటల్‌లో బస చేస్తున్నామని తెలిపింది వధువు కుటుంబ సభ్యులు. వరుడు మధురలో తనకు ఇల్లు ఉందని చెప్పుకున్నాడు, కానీ అతను అద్దె గదిలో నివసిస్తున్నాడు. అతనికి మంచి ఉద్యోగం ఉందని చెప్పుకున్నాడు. కానీ అతను ఒక ప్రైవేట్ ఉద్యోగంలో పనిచేశాడు. నిశ్చితార్థం సమయంలో వరుడి కుటుంబం వారి నిజమైన గుర్తింపును దాచి పెట్టి తమను మోసం చేసిందని వధువు కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే ఈ పెళ్లిని రద్దు చేస్తన్నామని చెప్పి.. పెళ్లి కుమారుడిపై దాడి చేసి.. అతడి బట్టలు కూడా చింపేసి రాత్రంతా బంధీగా ఉంచారు. పెళ్లికి ఖర్చు చేసిన ఐదు లక్షల రూపాయలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇద్దరు అన్నదమ్ములు ఏదో విధంగా రెండు లక్షల రూపాయలు ఏర్పాటు చేసి వధువు కుటుంబానికి ఇచ్చారు. దీంతో వరుడిని వారు బయటకు పంపారు.
