Affair: ఒడిశాలో ఇద్దరు పురుషుుల, ఒక మహిళను విద్యుత్ స్తంభానికి కట్టేచి చితకబాదారు. అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కొట్టారు. చివరకు పోలీసులు కలుగజేసుకుని పురుషులను, మహిళను రక్షించి ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు కర్రలో వారిపై దాడి చేశారు. వివరాలను పరిశీలిస్తే, కాశీపూర్ గ్రామానికి చెందిన సదరు మహిళకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. మయూర్భంజ్ జిల్లాలోని జాశీపూర్ వారపు సంతకు ఇద్దరు వ్యక్తులతో కలిసి బైక్‌పై వెళ్లింది. వీరు ముగ్గురు తిరిగి వస్తుందగా మహిళ కుటుంబీకులు వారిని గుర్తించారు.
Read Also: Japan Centenarians 2025: 100 ఏళ్ల క్లబ్‌లో మహిళలదే మెజారిటీ.. పాపం మగవాళ్లు
ఇది చూసిన మహిళ కుటుంబీకులు, సదరు మహిళకు ఇద్దరు పురుషులలో ఒకరితో సంబంధం ఉందని ఆరోపించారు. ఆ తర్వాత గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో, ముగ్గురిని విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. గ్రామస్తులు వంతుల వారీగా ఆ మహిళ, పురుషులను కొట్టడం, తన్నడం చేశారు. ఈ ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.
మహిళ మార్కెట్‌కు వెళ్లిన పురుషుల్లో ఒకరు ఆమె అత్తమామల కుటుంబానికి చాలా సన్నిహితుడని, ఆమెకు సోదరుడి లాంటి వాడని అధికారులు తెలిపారు. కానీ ఆమె అత్తమామలు, ఇతరులు ఆమె అతడితో సంబంధం కలిగి ఉందని అనుమానించడం ఆపలేదు. పోలీసులు, బాధితులు ముగ్గురిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. తదుపరి విచారణ జరుగుతుందని వెల్లడించారు.
