Demonic attack : దారుణం.. నర్సరీ చిన్నారిపై ఆయా పైశాచిక దాడి.!
- నర్సరీ చిన్నారిపై ఆయా పైశాచిక దాడి.! జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ ఘటన
- ఇంటి పై నుంచి రికార్డ్ చేసిన వీడియోతో నిజం బయటపడింది
- దాడితో తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారి.. హాస్పిటల్ పరీక్షల్లో షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Demonic attack : మేడ్చల్ జిల్లా, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ ప్రాంతంలో గల పూర్ణిమా స్కూల్లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నర్సరీ చదువుతున్న ఓ చిన్నారిపై స్కూల్ ఆయా అత్యంత పాశవికంగా, పైశాచికంగా దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. స్కూల్లో చిన్నారిపై జరుగుతున్న ఈ దారుణాన్ని స్కూల్ పక్కన ఉన్న ఇంటిపై నుండి ఓ యువకుడు వీడియో రికార్డ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో దృశ్యాలు ఆ ఆయా ఎంతటి క్రూరంగా ప్రవర్తించిందో స్పష్టం చేస్తున్నాయి. ఈ వీడియోనే ఈ కేసులో కీలక ఆధారంగా మారింది.
స్కూల్‌లో దాడికి గురైన చిన్నారి నిన్న సాయంత్రం నుండి ఆహారం తీసుకోకుండా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన రామ్ హాస్పిటల్ కు తరలించారు. చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు, ఆమె శరీరంపై దాడి జరిగినట్టు స్పష్టమైన గుర్తులు ఉన్నాయని, పాశవికంగా కొట్టినట్టు గుర్తించామని తెలిపారు. డాక్టర్ల నివేదికతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
చిన్నారిపై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు, వీడియో ఆధారంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తక్షణమే స్పందించారు. చిన్నారిపై దాడిచేసిన ఆయాను గుర్తించి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయాను పోలీసులు అదుపులోకి తీసుకుని, చిన్నారిపై దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. స్కూళ్లలో ఇలాంటి దారుణ ఘటన జరగడంపై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
CM Revanth Reddy : తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ పై సీఎం రేవంత్ రివ్యూ
తాజావార్తలు
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!