Site icon NTV Telugu

Demonic attack : దారుణం.. నర్సరీ చిన్నారిపై ఆయా పైశాచిక దాడి.!

Aaya Attack

Aaya Attack

Demonic attack : మేడ్చల్ జిల్లా, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ ప్రాంతంలో గల పూర్ణిమా స్కూల్లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నర్సరీ చదువుతున్న ఓ చిన్నారిపై స్కూల్ ఆయా అత్యంత పాశవికంగా, పైశాచికంగా దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. స్కూల్లో చిన్నారిపై జరుగుతున్న ఈ దారుణాన్ని స్కూల్ పక్కన ఉన్న ఇంటిపై నుండి ఓ యువకుడు వీడియో రికార్డ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో దృశ్యాలు ఆ ఆయా ఎంతటి క్రూరంగా ప్రవర్తించిందో స్పష్టం చేస్తున్నాయి. ఈ వీడియోనే ఈ కేసులో కీలక ఆధారంగా మారింది.

స్కూల్‌లో దాడికి గురైన చిన్నారి నిన్న సాయంత్రం నుండి ఆహారం తీసుకోకుండా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన రామ్ హాస్పిటల్ కు తరలించారు. చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు, ఆమె శరీరంపై దాడి జరిగినట్టు స్పష్టమైన గుర్తులు ఉన్నాయని, పాశవికంగా కొట్టినట్టు గుర్తించామని తెలిపారు. డాక్టర్ల నివేదికతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు.

చిన్నారిపై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు, వీడియో ఆధారంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తక్షణమే స్పందించారు. చిన్నారిపై దాడిచేసిన ఆయాను గుర్తించి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయాను పోలీసులు అదుపులోకి తీసుకుని, చిన్నారిపై దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. స్కూళ్లలో ఇలాంటి దారుణ ఘటన జరగడంపై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

CM Revanth Reddy : తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ పై సీఎం రేవంత్ రివ్యూ

Exit mobile version