Site icon NTV Telugu

Zahirabad Girl Case: జహీరాబాద్ అత్యాచారం కేసులో ట్విస్ట్.. బురిడీ కొట్టించిన యువతి?

Zahirabad Case Twist

Zahirabad Case Twist

New Twist In Zahirabad Married Woman Case: సంగారెడ్డిలోని జహీరాబాద్ యువతి అత్యాచార కేసులో తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. ఆ యువతి కట్టుకథ అల్లి, పోలీసుల్ని బురిడీ కొట్టించినట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణలో.. ఆ యువతికి పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారని, విభేదాల కారణంగా కొంతకాలం నుంచి భర్తతో దూరంగా ఉంటోందని తేలింది. కానీ, ఆ యువతి మాత్రం తనకు పెళ్లి కాలేదని పోలీసులకు చెప్తోంది. అంతేకాదు.. విచారణలో పొంతనలేని మాటలు చెప్తూ, పోలీసుల్ని కన్ఫ్యూజ్ చేస్తోంది.

దీంతో అనుమానం వచ్చిన పోలీసులు.. సీసీటీవి కెమెరాల్ని పరిశీలించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, తిరుమలగిరి, బోయిన్‌పల్లిలో ఉండే సీసీటీవీ కెమెరాల్ని నిశితంగా పరిశీలించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. మద్యం మత్తులో ఆ బాధిత యువతిని, స్థానికులే బాలానగర్ పోలీసులకు అప్పగించినట్టు తెలిసింది. మహిళా పోలీసులకు రోజంతా కౌన్సిలింగ్ ఇచ్చారు. జహీరాబాద్‌కి ఎలా వచ్చిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. అయితే.. యువతి మాత్రం తప్పుడు సమాచారం ఇస్తోంది. ఈ దెబ్బకు ఏం చేయాలో తెలీక.. పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

కాగా.. జహీరాబాద్‌లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనని అత్యాచారం చేసినట్టు ఆ యువతి మొదట పేర్కొంది. ఇంటికి వెళ్లేందుకు తాను ఆటో ఎక్కానని, కేపీహెచ్‌బీ మీదుగా వాళ్లు బలవంతంగా జహీరాబాద్ తీసుకొచ్చి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా.. ఆ యువతి కట్టుకథ అల్లుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ యువతి చెప్తున్న మాటలకి, సీసీటీవీ కెమెరాలోని దృశ్యాలకు పొంతనం లేకపోవడం.. పెళ్లి కూడా అవ్వలేదని చెప్తుండడంతో.. ఏదో పెద్ద కుట్రే ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Exit mobile version