Nellore Love Tragedy: నెల్లూరు జిల్లా ప్రేమోన్మాది ఘాతుకం చోటుచేసుకుంది. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న యువతి మైథిలి ప్రియా, సెప్టెంబర్ 6 పుట్టినరోజు కావడంతో నెల్లూరుకు వచ్చింది. అయితే, ఆ రోజు మైథిలి ప్రియతో మాట్లాడాలని చెప్పి రూమ్‌కు పిలిచాడు. రూమ్‌కి వెళ్లిన వెంటనే, కత్తితో దాడి చేసి ఆమెను హతమార్చాడు. హత్య చేసిన తర్వాత మృతురాలి చెల్లి సాహితీకి ఫోన్ చేసి, మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది, అందుకే చంపేశానని తెలియజేశాడు. దీంతో హూటాహుటిన సాహితీ సంఘటనా ప్రదేశానికి చేరుకునే సరికి మెట్లపైనే మైథిలి ప్రియా మృతదేహం కనిపించింది.
Read Also: SMS Alert: మీకు వచ్చిన ఎస్‌ఎంఎస్ చివర ఉన్న S, P, G, T అక్షరాల అర్థం తెలుసా?
ఇక, దర్గామిట్ట పోలీస్ స్టేషన్‌లో నిఖిల్ లొంగిపోయాడు. ఈ సందర్భంగా మైథిలి ప్రియ మృతదేహం దగ్గర తల్లి లక్ష్మీ రోదిస్తూ.. ప్రేమ పేరుతో వేధించి.. తన కుమార్తెను హత్య చేశాడని బోరును విలపించింది. కాగా, నిందితుడు రాపూరు మండలం చుట్టుపాలెం గ్రామానికి చెందినవాడు.. మైథిలి ప్రియతో అతను స్వాతి బి ఫార్మసీ కాలేజీలో క్లాస్‌మేట్ కూడా.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
