NTV Telugu Site icon

Crime: నీట్ విద్యార్థినిపై ఇద్దరు టీచర్ల అత్యాచారం.. బ్లాక్‌మెయిల్ చేస్తూ నెలల పాటు అఘాయిత్యం..

Crime

Crime

Crime: విద్య నేర్పిస్తారని నమ్మి వచ్చిన విద్యార్థిని చెరబట్టారు ఇద్దరు టీచర్లు. నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) మెడికల్ ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యేందుకు కాన్పూర్ వెళ్లిన ఓ మైనర్‌పై నగరంలోని ప్రముఖ కోచింగ్ సెంటర్‌కు చెందిన ఇద్దరు ప్రముఖ ఉపాధ్యాయులు నెలల తరబడి అత్యాచారం చేసి బ్లాక్‌మెయిల్ చేశారు. టీచర్లలో ఒకరిని కొన్ని నెలల క్రితం అరెస్ట్ చేశామని, అతను మరో విద్యార్థిని లైంగికంగా వేధిస్తున్న సీసీటీవీ ఫుటేజీ వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అత్యాచారానికి గురైన అమ్మాయి తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయుల్ని అరెస్ట్ చేశారు.

Read Also: Donald Trump: ట్రంప్‌తో భారతీయులకు చిక్కులేనా..? వారి పిల్లలకు పౌరసత్వం డౌటేనా..?

విద్యార్థిని 2022లో పరీక్షకు సిద్ధమయ్యేందుకు కాన్పూర్ వెళ్లింది. ఈ ఏడాది జనవరిలో బయాలజీ టీచర్ 32 ఏళ్ల సాహిల్ సిద్ధిఖీ తన ఇంట్లో జరిగే పార్టీకి మైనర్ విద్యార్థిని ఆహ్వానించాడు. అయితే, ఆ అమ్మాయి అతడి ఫ్లాట్‌కి చేరుకోగానే ఒంటరిగా ఉన్నట్లు విద్యార్థిని గ్రహించింది. సిద్ధిఖీ తాగి వచ్చి తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. ఈ వీడియోలను బయటపెడతామని, తన కుటుంబాన్ని చంపేస్తానని సిద్ధిఖీ బెదిరించాడని, అనేక సందర్భాల్లో తనపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తనను సిద్ధిఖీ తన ఫ్లాట్‌లోనే కొన్ని రోజులు బందీగా ఉంచాడని పేర్కొంది.

ఇదిలా ఉంటే, పార్టీలకు రావాలంటూ బలవంతం చేసే వాడని, అలాంటి ఒక పార్టీలో ఆమెపై 39 ఏళ్ల కెమిస్ట్రీ టీచర్ వికాస్ పోర్వాల్ కూడా అత్యాచారం చేసినట్లు చెప్పింది. హోలీ సందర్భంగా తాను తల్లిదండ్రుల వద్దకు వెళ్లానని, అయితే సిద్ధికీ తనకు ఫోన్ చేసి తిరిగా రావాలిన, రాకపోతే కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని విద్యార్థిని తెలిపింది. తాజాగా సిద్ధిఖి మరో విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్న వీడియో వైరల్ కావడంతో బాలిక ధైర్యం తెచ్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిద్దిఖీ, పోర్వార్‌ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.