NTV Telugu Site icon

yashashree shinde case: యశశ్రీ హత్య కేసులో సంచలన విషయాలు.. తప్పించుకునేందుకు నిందితుడు దావూద్ మాస్టర్ ప్లాన్..

Yashashree Shinde Case

Yashashree Shinde Case

yashashree shinde case: నవీ ముంబైలో 20 ఏళ్ల యశశ్రీ షిండే హత్య కేసు సంచలనంగా మారింది. ఉరాన్ ప్రాంతంలో పొదల్లో ఆమె మృతదేహం కత్తిపోట్ల కలిగిన స్థితిలో దొరికింది. ఈ కేసులో నిందితుడిని కర్ణాటక గుల్బర్గాకు చెందిన దావూద్ షేక్‌గా గుర్తించారు. హత్య జరిగిన 5 రోజుల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. యశశ్రీని తన కోరికలు తీర్చాలంటూ దావూద్ ఒత్తిడి చేయడం, అందుకు యశశ్రీ లొంగకపోవడంతోనే హత్య జరిగింది. ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. యశశ్రీ తండ్రి దావూద్ షేక్‌పై 2019లో పోక్సో కేసు నమోదు చేశారు. ఆ సమయంలో దావూద్ దాదాపు నెలన్నర పాటు జైలు జీవితం గడిపాడు.

యశశ్రీపై ఫీలింగ్స్ పెంచుకున్న దావూద్ ఆమెను పెళ్లి చేసుకోవాలని, ముంబై నుంచి కర్ణాటకకు మకాం మార్చాలని అనునకున్నాడు. ఈ విషయంపై దావూద్, యశశ్రీపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు యశశ్రీ ఒప్పుకోలేదు. యశశ్రీ నిందితుడి నెంబర్ బ్లాక్ చేసిన ప్రతీసారి దావూద్ అతడి స్నేహితుడు మొహ్సిన్ ద్వారా ఆమెతో కమ్యూనికేట్ అయ్యేవాడు. ఈ బెదిరింపులు తీవ్రస్తాయి చేరాయి. ఆమె వ్యక్తిగత ఫోటోలతో దావూద్ బెదిరించడం, బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు.

Read Also: Wayanad landslide: వయనాడ్‌లో రాహుల్, ప్రియాంక పర్యటన.. బాధితుల పరామర్శ

యశశ్రీని కలిసేందుకు గుల్బర్గా నుంచి ముంబై జూలై 23న వచ్చాడు. మరుసటి రోజు యశశ్రీని కలవాలని ఒత్తిడి చేశాడు. మొదట ఆమె నిరాకరించింది. అయితే, జూలై 25న దావూద్ ఆమె ఫోటోని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇది డిలీట్ చేయాలంటే తనను కలవాలని యశశ్రీని బలవంతం చేశాడు. హత్య జరిగిన రోజున బేలాపూర్‌లో ఉద్యోగం చేసే ఆమె హఫ్ డే లీవ్ తీసుకుని జుయ్ నగర్ రైల్వే స్టేషన్‌ సమీపంలో దావూద్‌ని కలిసింది. తీవ్ర వాగ్వాదం తర్వాత ఆమెను దావూద్ చంపాడు. నవీ ముంబైలోని ఉరాన్ ప్రాంతంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని పొదల్లో అనేక కత్తిపోట్లతో ఉన్న యశశ్రీ మృతదేహం శనివారం కనుగొనబడింది.

హత్య చేసేందుకు బెంగళూర్ నుంచి దావూద్ రెండు కత్తుల్ని తీసుకువచ్చినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. జూలై 25న హత్య జరిగిన తర్వాత ఉరాన్ నుంచి పన్వెల్ వరకు రైలులో ప్రయాణించి, ఆ తర్వాత బస్సులో కర్ణాటక చేరుకున్నాడు. యశశ్రీ శరీరంపై దావూద్ పేరుతో రెండు టాటూలు కనిపించాయి. యశశ్రీ ఇష్టపూర్వకంగా తన శరీరంపై టాటూ వేయించుకున్నాడా లేక దావూద్ బలవంతంగా అలా టాటూ వేయించుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

తన మొబైల్ ఫోన్ ద్వారా పోలీసులు కనిపెట్టవచ్చని దానిని స్విచ్ఛాప్ చేసి కర్ణాటకలోని తన అమ్మమ్మ వద్ద వదిలేశాడు. అక్కడ నుంచి కాలి మార్గం ద్వారా పర్వతాలను ఎక్కుతూ, దిగుతూ పోలీసులకు చిక్కకుండా ప్లాన్ చేసుకున్నాడు. హత్యకు ఐదు రోజుల ముందు, జూలై 20న, 2019 పోక్సో కేసుకు సంబంధించి దావూద్ కోర్టుకు హాజరుకానందుకు పన్వెల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. దావూద్ కదలికలపై నిఘా పెంచిన నవీ ముంబై పోలీసులు భారీ వేట ప్రారంభించారు. కర్ణాటకలో షాపూర్ ప్రాంతంలోని కొండల్లో అతడిని ట్రాక్ చేశారు. జూలై 30వ తేదీ ఉదయం, ఐదు రోజుల నిరంతర అన్వేషణ తర్వాత, దాదాపు 5 గంటలకు పర్వతాల నుండి దావూద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.