Site icon NTV Telugu

Vijayawada Fraud: ఉద్యోగం అన్నాడు.. అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చాడు.. నిరుద్యోగులను నిండా ముంచాడు..!

Vijayawada Fraud

Vijayawada Fraud

Vijayawada Fraud: నిరుద్యోగులకు ఉద్యోగం పేరుతో గాలం వేయడం.. అందినకాడికి దండుకొని బోర్డు తిప్పేస్తున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూస్తూనే ఉన్నాయి.. పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని ఇలా సొమ్ము చేసుకుంటూ.. వారిని నిండా ముంచేస్తున్నారు కేటుగాళ్లు.. తాజాగా, బెజవాడలో ఉద్యోగాలు ఇప్పిస్తామవి లక్షల రూపాయలు దోచేశారు కేటుగాళ్లు. ట్రైవింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామని.. నమ్మించి నిరుద్యోగులను నిండా ముంచారు కేటుగాళ్లు. ఇక, మీకు ఉద్యోగాలకు కూడా వచ్చేశాయంటూ ఫేక్‌ అపాయింట్‌మెంట్‌ లెటర్లు కూడా ఇచ్చి.. నమ్మించే ప్రయత్నం చేశారు.. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలను ఇస్తామనే పేరుతో విజయవాడ మొగల్‌రాజుపురంలోని నాగరాజు ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ మోసం చేసింది..

Read Also: Deputy CM: ‘‘ప్రజలు, సైన్యం మోడీ పాదాలకు నమస్కరించాలి’’.. ఎంపీ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..

ఒక్కొక్కరి వద్ద రెండు లక్షల రూపాయల నుండి మూడు లక్షల రూపాయలు వరకు వసూలు చేసి బోర్డు తిప్పేశారు నాగరాజు ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకులు.. మాచవరంవరం పోలీసు స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చినా న్యాయం జరగలేదని విజయవాడ పోలీస్‌ కమీషనర్‌ను కలిసేందుకు వెళ్లారు బాధితులు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది బాధితులు ఉన్నారని అంటున్నారు బాధిత నిరుద్యోగులు. ఫిర్యాదు చేసి నెల రోజులు గడిచినా ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.. సంస్థ ప్రతినిధులు నాగరాజు అండ్ హెచ్ఆర్ శిరీషను అరెస్ట్ చేయకుండా మాచవరం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.. అయితే, మోసపోయిన వాళ్లందరూ ఒకేసారి వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు.. వారిపై చర్యలు తీసుకునే సరికి పది సంవత్సరాలైనా సమయం పట్టవచ్చు అని హేళంగా సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు.. దీంతో, చేసేదిలేక విజయవాడ సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితులు.. సీపీ రాజశేఖర్ బాబు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Exit mobile version