NTV Telugu Site icon

Myanmar Woman Molested: ఢిల్లీలో దారుణం.. మయన్మార్‌కు చెందిన మహిళపై సామూహిక అత్యాచారం

Myanmar Woman Molested

Myanmar Woman Molested

Myanmar-Origin Woman Molested By 4 Men In Delhi Kalindi Kunj: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. కాళింది కుంజ్‌లో మయన్మార్‌కు చెందిన ఓ మహిళల(21)పై సామూహిక అత్యాచారం జరిగింది. ఒక ఆటో డ్రైవర్ ఆమెను అపహరించి, తన గదికి తీసుకెళ్లాడు. అక్కడ అతనితో కలిసి మొత్తం నలుగురు వ్యక్తులు.. ఆమెపై ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అదే ఆటోలో ఓ మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి వదిలేశారు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆ మహిళ.. జరిగిన దారుణాన్ని తన భర్తకు చెప్పింది. భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సామూహిక అత్యాచారం, కిడ్నాప్, దాడి, బెదిరింపు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే.. ఇప్పటివరకూ ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదు.

Greece Train Accident: గ్రీస్‌లో ఘోర ప్రమాదం.. ఢీకొన్న రైళ్లు.. 26 మంది మృతి

మయన్మార్ నుంచి రిజిస్టర్డ్ శరణార్థి అయిన ఆ మహిళ తన భర్తతో కలిసి వికాస్‌పురిలో నివసిస్తోంది. ఈ దంపతులకు రెండున్నరేళ్ల కూతురు కూడా ఉంది. నెల రోజుల నుంచి తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న బాధిత మహిళ.. డాక్టర్‌ను కలవడానికి తన భర్తతో కలిసి ఫిబ్రవరి 22వ తేదీన కాళింది కుంజ్‌కి వచ్చింది. డాక్టర్‌ని కలిసిన అనంతరం భార్యాభర్తలు కలిసి రాత్రి 9:30 గంటలకు కాళింది కుంజ్ మెట్రో స్టేషన్‌కు వెళ్లారు. ఆ సమయంలో టాయిలెట్ చేసేందుకు ఆమె భర్త రోడ్డు దాటాడు. అప్పుడు మహిళ ఒంటరిగా ఉండటం గమనించిన ఆటో డ్రైవర్.. ఆమె వద్దకు వెళ్లి పక్కనే ఆటో ఆపాడు. ఆమె కేకలు వేయడం ప్రారంభించాడు.. గుడ్డతో నోటిని బిగపట్టి, కూతురితో పాటు ఆ మహిళను బలవంతంగా ఆటోలో ఎక్కించాడు. ఆటోలో కూర్చోబెట్టాక ఆ మహిళ స్పృహ కోల్పోయింది.

Rishabh Pant: జీవితం విలువ తెలిసింది.. రెట్టింపు ఉత్సాహంతో తిరిగొస్తా

అక్కడి నుంచి ఆ ఆటో డ్రైవర్ నేరుగా తన రూమ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ తన ముగ్గురు స్నేహితులతో కలిసి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్పృహలోకి వచ్చాక.. తాను ఒక రూమ్‌లో బంధింపబడ్డానని, తనపై అత్యాచారం జరిగిందని గుర్తించింది. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 23వ తేదీన నిందితులు ఆమెను ఓ మారుమూల ప్రాంతంలో పడేశారు. తన శరణార్ధి కార్డును చూపించిన తర్వాత.. స్థానికులు ఆమెను ఇంటి వద్ద దింపారు. తన భర్తకు తనపై జరిగిన అఘాయిత్యం గురించి వివరించిన ఆమె.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 26న పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.