Shocking: హర్యానాలో మహిళ హత్య సంచలనంగా మారింది. పోలీసుల విచారణ తర్వాత విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. యమునా నగర్ జిల్లాలో జరిగిన మహిళ హత్యను పోలీసులు ఛేదించారు. గొడవల కారణంగా కన్న కొడుకే హత్యకు పాల్పడినట్లు తేలింది. ఈ హత్యకు అతడి స్నేహితుడు సహకరించనట్లు గుర్తించారు. శ్యాంపూర్ గ్రామ సర్పంచ్ భార్య బల్జీందర్ కౌర్ డిసెంబర్ 24 రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించింది. హత్య కేసు విచారణ కఠినంగా మారడంతో దీనిని క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు.
Read Also: Meenakshi Chaudhary: నేను డ్యాన్స్ చేయడానికి సిగ్గుపడుతుంటాను: మీనాక్షి చౌదరి
సాంకేతిక ఆధారాలు, మొబైల్ లొకేషన్ ట్రాకింగ్, కాల్ డిటైల్స్ ఆధారంగా కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుమారుడు గోమిత్ రాఠీ తన కుటుంబానికి తెలియకుండా డిసెంబర్ 18న రహస్యంగా ఇంగ్లాండ్ నుంచి భారత్‌కు వచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. గోమిల్ ఇండియా వస్తున్న విషయం గ్రామంలో కేవలం అతడి స్నేహితుడు పంకజ్‌కు మాతరమే తెలుసు. పథకం ప్రకారం, డిసెంబర్ 24న గోమిత్ తన గ్రామానికి వచ్చి, పశువుల పాకతో దాక్కున్నాడు. రాత్రి తన తల్లిపై దాడి చేసి, గొంతు నులిమి హత్య చేశాడు. హత్యను ప్రమాదవశాత్తు సంఘటనగా చూపించేందుకు మృతదేహాన్ని నీటి ట్యాంక్‌లో పడేశాడు.
తల్లితో గోమిత్ తరుచూ గొడవపడే వాడు. అతను వేరే కులానికి చెందిన మహిళతో రిలేషన్‌లో ఉన్నాడు. ఇద్దరి ప్రేమను తల్లి వ్యతిరేకించేంది. దీంతో, తల్లిపై కోపం పెంచుకున్నాడు. స్టడీ వీసాపై యూకేకు వెళ్లిన అతను, అక్కడ ఒక దుకాణంలో పనిచేస్తున్నాడు. తిరిగి వచ్చి తల్లిని హతమార్చాడు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ హత్యపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. మొబైల్ డేటా, లొకేషన్ అనాలిసిస్, గ్రామంలో కదలికల్ని గమనించి ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
