Mumbai Woman Physically Harassed and Tortured By 3 Men: ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నా, ఎన్నో కఠినమైన చర్యలు తీసుకుంటున్నా.. మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఎక్కడో ఒక చోట మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఒంటరిగా కనిపిస్తున్న మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన జరిగింది. ఒంటరిగా ఉన్న ఒక మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెపై తమ పైశాచికత్వం ప్రదర్శించారు. వీడియో తీసి, బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఓ మహిళ ఒంటరిగా ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు.. ఆమెపై ఎప్పట్నుంచో కన్నేశారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఆమె ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకొని, ఆ ముగ్గురు ఇంట్లోకి చొరబడ్డారు. ఆమెను కత్తితో బెదిరించి.. ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. లైంగిక దాడి చేస్తున్న సమయంలోనే.. ఆమె ప్రైవేటు భాగాలపై సిగరెట్‌తో కాల్చారు. ఆమె ఛాతీ, రెండు చేతులపై.. కత్తితో దాడి చేశారు. ఈ మొత్తం తతంగాన్ని.. ఆ ముగ్గురు యువకుల్లో ఒకడు వీడియో తీశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే.. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తామని బెదిరించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే.. బాధితురాలు వారి బెదిరింపులకు భయడపలేదు. తనలాగే మరొకరికి ఇలాంటి దారుణ పరిస్థితి రాకూడదని భావించి.. ఎన్జీవోలను ఆశ్రయించింది. వాళ్ల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆ ముగ్గురు నిందితులపై సెక్షన్లు 376 (అత్యాచారం), 376డి (సామూహిక అత్యాచారం), 377 (అసహజ శృంగారం), 324 (ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపరచడం), ఇతర నేరాల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆ ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
