Site icon NTV Telugu

Mumbai : వైద్య చరిత్రలో మిరాకీల్..నాలుగు గంటలు శ్రమించి బ్రతికించారు..

Mumbai Doctors

Mumbai Doctors

ముంబై లో ఓ వ్యాపాత్తను కుటుంబ కలహాల వల్ల తన తమ్ముడే కత్తితో మెడపై పొడిచాడు.. వెంటనే మేల్కొన్న ఆ వ్యక్తి కత్తిని మెడకు పెట్టుకొనే అరుస్తూ బయటకు పారిపోయాడు.. అతనికి మెలుకువ రాగానే తమ్ముడు అక్కడి నుంచి ఉడాయించాడు.. తీవ్రంగా గాయమైన వ్యక్తి ప్రాణ భయం తో కిలో మీటర్ మేర పురుగులు పెట్టాడు..అక్కడే ఉండే ఆసుపత్రికి వెళ్లారు.. అక్కడ డాక్టర్లు అతన్ని ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లి నాలుగు గంటలకు పై శ్రమించి కత్తిని బయటకు తీశారు.. అలా అతని పునర్జన్మను ఇచ్చారు.. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు..

వివరాల్లోకి వెళితే.. ముంబై నగరంలోని 30 ఏళ్ల ప్రముఖ వ్యాపారవేత్త అయిన తేజస్ పాటిల్, జూన్ 3న నిద్రిస్తున్న సమయంలో అతని సోదరుడు కత్తితో దాడిచేసి.. మెడమీద పొడిచాడు. తుప్పుపట్టిన కత్తి మెడకు గుచ్చుకుంది. తేజస్ లేవడంతో.. అతని సోదరుడు మోనీష్ తన స్నేహితులతో కలిసి పారిపోయాడు. తేజస్ ఆలస్యం చేయకుండా దగ్గర్లోని ఎంపీసీటీ హాస్పిటల్‌కి కత్తితోనే వెళ్ళాడు..అక్కడ వైద్యులు తేజస్ పాటిల్ మెడలోని కత్తిని తొలగించి, దెబ్బతిన్న రక్తనాళాలను సరిచేయడం కోసం 4 గంటలపాటు శస్త్రచికిత్స చేశారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే అనేక ప్రధాన రక్తనాళాలు దెబ్బతినలేదని.. కత్తి కాస్త అటూ, ఇటూ అయితే.. ఆ రక్తనాళాలు తెగి ప్రాణానికి ప్రమాదం ఉండేదని తెలిపారు..

ఈ ఘటనపై వైద్యులు మాట్లాడుతూ..పాటిల్ లోపలికి రాగానే మెడ, మెదడు, ఛాతీకి సీటీ స్కాన్ నిర్వహించి కత్తి బ్లేడ్ మెడకు ఏ మేరకు గుచ్చుకుని నష్టం జరిగిందో తనిఖీ చేశాం. శాశ్వత వైకల్యం లేదా మరణానికి కారణమయ్యే ధమనులు, నరాలను దెబ్బతీయకుండా కత్తిని తొలగించవచ్చని నిర్ధారించడానికి ప్లాస్టిక్ సర్జన్ లతో సహా ప్రముఖ వైద్యులు చర్చించి ఆపరేషన్ చేసి కత్తిని తొలగించినట్లు తెలిపారు.. ప్రస్తుతం రోగి పరిస్థితి బాగానే ఉందని, ఎదో అద్భుతం జరిగింది అందుకే అతను బ్రతికాడు అంటూ వైద్యులు తెలిపారు…

Exit mobile version