Mujra Party : రాజకీయ నాయకుల ప్రమేయంతో నగర శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ముజ్రా పార్టీ సంచలనానికి కారణమైంది. రాచకొండ పోలీసుల సకాలంలో జోక్యంతో ఈ పార్టీని భగ్నం చేశారు. ఎన్నికల వేళ జరుగుతున్న ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం, హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ ఫార్మ్‌హౌస్‌లో ఒక రాజకీయ పార్టీకి చెందిన నేతలు ముజ్రా పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇందులో అమ్మాయిలను పిలిపించి విందు, మద్యం, నృత్యాలతో పార్టీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వేడుక ప్రధానంగా ఎన్నికలు జరగనున్న నియోజకవర్గంలోని ప్రముఖ నాయకుల కోసం నిర్వహించారని తెలుస్తోంది.
Telangana : బీసీ రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు తీర్పుపై కోబినట్‌లో చర్చ!
ఈ ముజ్రా పార్టీని గత ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఒక నాయకుడు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఆయన సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు ఆ ప్రదేశంపై దాడి చేసి పార్టీని భగ్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అమ్మాయిలతో పాటు కొందరు రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
