Site icon NTV Telugu

MRPS Leader Murdered: ఎమ్మార్పీఎస్ రాయల సీమ అధ్యక్షుడి దారుణ హత్య..

Lakshmi Narayana

Lakshmi Narayana

MRPS Leader Murdered: ఎమ్మార్పీఎస్ రాయల సీమ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇంఛార్జ్‌గా ఉన్న లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యాడు.. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులో ఆలూరు రోడ్డు చిప్పగిరి రైల్వే బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది.. గుంతకల్ నుండి చిప్పగిరికి లక్ష్మీనారాయణ వెళ్తుండగా హత్య చేశారు.. లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని టిప్పర్‌తో ఢీకొట్టారు.. ఈ ఘటనతో కారులో చిక్కుకున్న లక్ష్మీనారాయణపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు గుర్తుతెలియని వ్యక్తులు. అయితే, తీవ్రగాయాలపాలైన లక్ష్మీనారాయణను వెంటనే ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది.. ఆస్పత్రికి తరలించే క్రమంలోనే లక్ష్మీనారాయణ ప్రాణాలు విడిచినట్టుగా చెబుతున్నారు.. అయితే, ఎమ్మార్పీఎస్ రాయల సీమ అధ్యక్షుడిగా పనిచేస్తూ.. ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్న లక్ష్మీనారాయణపై ఎవరు ? దాడి చేశారు.. ఆయనపై అత్యంత దారుణంగా దాడిచేయాల్సిన అవసరం ఏం వచ్చింది..? ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారు..? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Read Also: CNG Car Mileage: సులభమైన మార్గాలతో సీఎన్జీ కార్ల మైలేజ్ ఎలా పెంచుకోవాలంటే?

Exit mobile version