Naveen Reddy : రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాలపై మిస్టర్ టీ బ్రాండ్ యజమాని నవీన్ రెడ్డికు నగరంలో 6 నెలల పాటు బహిష్కరణ విధించబడింది. ఆదిభట్ల పోలీస్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని పోలీసుల నివేదికల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నవీన్ రెడ్డి పై ఐదు కేసులు నమోదు కాగా, సాక్షులను బెదిరిస్తూ, నగరంలో కలవరం సృష్టిస్తున్నట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ఆదిబట్ల ఇన్స్పెక్టర్, ఇబ్రహీంపట్నం ఏసీపీ నివేదికల ఆధారంగా సీపీ సుధీర్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా, 2022లో డెంటల్ విద్యార్థిని నిశ్చితార్థ వేడుకలో తన గ్యాంగ్‌తో కిడ్నాప్ చేసిన ఘటన, అలాగే డెంటల్ డాక్టర్ ఇంట్లో హంగామా చేసి ఆస్తి ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన ఆరోపణలు నవీన్ రెడ్డి పై ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
Viral Video : గాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ .. తేడా కొడితే.. అంతే సంగతులు
అదేవిధంగా, బాధిత విద్యార్థిని , ఆమె కుటుంబాన్ని నిరంతరం బెదిరిస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి లాంఛనక సంఘటనల కారణంగా పీడీ యాక్ట్ కూడా ఇప్పటికే అమలు చేయబడినట్లు పోలీసులు తెలిపారు. రాచకొండ సీపీ చర్య తర్వాత, మిస్టర్ టీ యజమాని నవీన్ రెడ్డి కోసం ఇది పెద్ద షాక్‌గా మారింది. ఈ నిర్ణయం స్థానికంగా , వ్యాపార పరిషరాల్లో చర్చలకు దారితీస్తుందని, నగర శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు తమ చర్యల్లో సీరియస్‌గా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు.
Supreme court: ‘‘ ఉరిశిక్ష ’’ మార్పుకు కేంద్రం సిద్ధంగా లేదు.. సుప్రీంకోర్టు ఆక్షేపణ..
