Rasgulla bomb: మధ్యప్రదేశ్‌లోని డొండోరి జిల్లాలో విషాదకర సంఘటన జరిగింది. రసగుల్లా రూపంలో ఉన్న బాంబును కొరకడంతో ఒక వ్యక్తి మరణించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 35 ఏళ్ల రాజేంద్ర బరోటియా చికిత్స పొందుతూ మరణించారు. మంగళవారం రాత్రి పదారియా ఛంతా గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాజేంద్ర కుటుంబ సభ్యులతో రాత్రి వేళ భోజనం ముగించుకుని, ఇంటి ముందు చలిమంట వద్ద కూర్చున్నాడు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన రామభగత్ బరోటియా అక్కడికి వచ్చాడు. రాజేంద్రకు పందుల వేటకు ఉపయోగించే బాంబును రసగుల్లా అని నమ్మించి ఇచ్చాడు. దానిని నోట్లో పెట్టుకుని కొరికిన వెంటనే పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి రాజేంద్ర ముఖం ఛిద్రమైంది. తీవ్రగాయాలతో అతను మరణించారు.
ఈ ఘటనపై డిండోరి కోత్వాలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రామభగత్ బరోటియాపై కేసు మర్డర్ కేసు నమోదు చేశారు. బుధవారం రాజేంద్ర మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సాధారణంగా సాగిన సాయంత్రపు సంభాషణ చివరకు ప్రాణాలు తీసిన ఘటనగా మారడంతో గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

