Husband Killed Neighbour: భార్యభర్తల మధ్య ‘చికెన్’ గొడవ.. మధ్యలో వెళ్లిన వ్యక్తి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Man Kills Neighbour For Interfering In Fight With His Wife: పొరుగింట్లో గొడవ జరుగుతున్నప్పుడు.. దాన్ని పరిష్కరించేందుకు కొందరు ముందుకు వస్తారు. గొడవ పడకుండా, సునాయాసంగా సమస్యని పరిష్కరించుకోవాల్సిందిగా సూచనలు ఇస్తుంటారు. అలాగే.. భార్యాభర్తల మధ్య వివాదాన్ని తీర్చేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించగా, ప్రాణాలు కోల్పోయాడు. తమ విషయంలో జోక్యం చేసుకున్నాడన్న కోపంతో.. పొరుగింట్లో ఉండే ఒక వ్యక్తిని భర్త దారుణంగా హతమార్చాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని బిల్ఖిరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
బిల్ఖిరియా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక జంట నివాసం ఉంటోంది. మంగళవారం వీరి మధ్య గొడవ నెలకొంది. చికెన్ తినాలని అనిపించి, మార్కెట్ నుంచి భర్త పప్పు అహిర్వార్ చికెన్ తీసుకొచ్చాడు. దాన్ని వండమని భార్యని కోరాడు. కానీ, ఆమె చికెన్ వండేందుకు నిరాకరించింది. తనకు వండే మూడ్ లేదని మొండికేసింది. దీంతో కోపాద్రిక్తుడైన భర్త.. ఆమెను చితకబాదాడు. ఆ దెబ్బలు భరించలేక.. భార్య పెద్ద పెద్ద కేకలు వేసింది. దీంతో.. ఇరుగు పొరుగు వారు ఇంటికి చేరుకొని, వివాదం సద్దుమణిగేలా చేశారు. అలా వచ్చిన వారిలో బబ్లూ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతడే ఎక్కువ జోక్యం చేసుకొని, భార్యాభర్తల గొడవని పరిష్కరించాడు.
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
అప్పటి నుంచే అహిర్వార్ ఆ బబ్లూపై కోపం పెంచుకున్నాడు. తమ వివాదంలోకి జోక్యం చేసుకున్నాడని రగిలిపోయాడు. దాంతో.. అతడే వెంటనే తన చేతిలో కర్ర పట్టుకొని, బబ్లూ ఇంటికి వెళ్లాడు. మా మధ్య దూరడానికి నువ్వు ఎవడ్రా అని చెప్తూ.. కర్రతో దారుణంగా కొట్టాడు. ఆ దెబ్బలకు బబ్లూ తీవ్ర గాయాలపాలు కావడంతో.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే.. బబ్లూ అప్పటికే మరణించాడని వైద్యులు ధృవీకరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..