NTV Telugu Site icon

Husband Killed Neighbour: భార్యభర్తల మధ్య ‘చికెన్’ గొడవ.. మధ్యలో వెళ్లిన వ్యక్తి హత్య

Man Killed Neighbour

Man Killed Neighbour

MP Man Kills Neighbour For Interfering In Fight With His Wife: పొరుగింట్లో గొడవ జరుగుతున్నప్పుడు.. దాన్ని పరిష్కరించేందుకు కొందరు ముందుకు వస్తారు. గొడవ పడకుండా, సునాయాసంగా సమస్యని పరిష్కరించుకోవాల్సిందిగా సూచనలు ఇస్తుంటారు. అలాగే.. భార్యాభర్తల మధ్య వివాదాన్ని తీర్చేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించగా, ప్రాణాలు కోల్పోయాడు. తమ విషయంలో జోక్యం చేసుకున్నాడన్న కోపంతో.. పొరుగింట్లో ఉండే ఒక వ్యక్తిని భర్త దారుణంగా హతమార్చాడు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని బిల్ఖిరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

బిల్ఖిరియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక జంట నివాసం ఉంటోంది. మంగళవారం వీరి మధ్య గొడవ నెలకొంది. చికెన్ తినాలని అనిపించి, మార్కెట్ నుంచి భర్త పప్పు అహిర్వార్ చికెన్ తీసుకొచ్చాడు. దాన్ని వండమని భార్యని కోరాడు. కానీ, ఆమె చికెన్ వండేందుకు నిరాకరించింది. తనకు వండే మూడ్ లేదని మొండికేసింది. దీంతో కోపాద్రిక్తుడైన భర్త.. ఆమెను చితకబాదాడు. ఆ దెబ్బలు భరించలేక.. భార్య పెద్ద పెద్ద కేకలు వేసింది. దీంతో.. ఇరుగు పొరుగు వారు ఇంటికి చేరుకొని, వివాదం సద్దుమణిగేలా చేశారు. అలా వచ్చిన వారిలో బబ్లూ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతడే ఎక్కువ జోక్యం చేసుకొని, భార్యాభర్తల గొడవని పరిష్కరించాడు.

అప్పటి నుంచే అహిర్వార్ ఆ బబ్లూపై కోపం పెంచుకున్నాడు. తమ వివాదంలోకి జోక్యం చేసుకున్నాడని రగిలిపోయాడు. దాంతో.. అతడే వెంటనే తన చేతిలో కర్ర పట్టుకొని, బబ్లూ ఇంటికి వెళ్లాడు. మా మధ్య దూరడానికి నువ్వు ఎవడ్రా అని చెప్తూ.. కర్రతో దారుణంగా కొట్టాడు. ఆ దెబ్బలకు బబ్లూ తీవ్ర గాయాలపాలు కావడంతో.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే.. బబ్లూ అప్పటికే మరణించాడని వైద్యులు ధృవీకరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Show comments