POCSO Case: నల్గొండ జిల్లాలో పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రియుడితో కలిసి కన్న కూతురిపైనే అత్యాచారం చేయించిన మహిళకు 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అంతే కాదు నిందితుడికి కూడా 22 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు వసంతపురి యాదమ్మ. ఈమెకు ఓ కూతురు ఉంది. ఆ అమ్మాయికి ఇంకా మైనారిటీ కూడా తీరలేదు. మరోవైపు యాదమ్మకు.. శివకుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఓ వైపు యాదమ్మతో వివాహేతర బంధం నడిపిస్తూనే.. ఆమె కూతురిపైనా కన్నేశాడు కామాంధుడు శివకుమార్. ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ తంతుకు తల్లి యాదమ్మ కూడా సహకరించింది. కానీ మైనర్ బాలిక ప్రతిఘటించింది. ఐతే ఆమెపై శారీరకంగా దాడికి పాల్పడ్డాడు శివకుమార్. సొంత తల్లి యాదమ్మే దగ్గరుండి మరీ అత్యాచారం చేయించింది. ఈ ఘటనను ఆ దుర్మార్గులు వీడియో కూడా తీశారు.
Adilabad: బైక్ లిఫ్ట్ అడిగిన లేడీ కిలాడీ.. ఆ వ్యక్తిని ముగ్గులోకి దింపి ఏం చేసిందో చూడండి..
ఈ ఘటనపై 2023 మే 8న బాధితురాలు నల్లగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తల్లి, ఆమె ప్రియుడు ఇద్దరి పైనా కేసు నమోదు చేసిన పోలీసులు.. చార్జీషీట్ దాఖలు చేశారు. రెండేళ్ల విచారణ అనంతరం.. ఇద్దరినీ దోషులుగా తేల్చింది పోక్సో కోర్టు. ఇద్దరికీ 22 ఏళ్ల జైలు శిక్షతోపాటు చెరో రూ. 5వేలు జరిమానా విధించింది. సరిగ్గా తీర్పు సమయంలో నిందితుడు శివకుమార్ వాష్ రూమ్‌కి వెళ్లి వస్తానని చెప్పి పరారయ్యాడు. అతనిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. చివరకు నిందితున్ని పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. కోర్టు తీర్పును అనుసరించి వారిని జైలుకు తరలించారు.
OnePlus Nord 5 vs Vivo V60: ప్రాసెసర్, డిస్ప్లే, డిజైన్ లో ప్రీమియం ఏది? ఎందుకు?
