Site icon NTV Telugu

Srinu Arrest : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శ్రీను అరెస్ట్..

Srinivas Arrest

Srinivas Arrest

Srinu Arrest : తెలంగాణలో వరుస మోసాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సంపంగి శ్రీనివాస్ అలియాస్ శ్రీను, శివ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఆయన్ను రాజేంద్రనగర్ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సంపంగి శ్రీనివాస్ ఇప్పటికే అనేక దోపిడీలకు పాల్పడ్డాడు. లేబర్ అడ్డాలో ఒంటరి మహిళలను పని ఉందని చెప్పి బైక్ మీద ఎక్కించుకుని వెళ్లేవాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లికత్తితో బెదిరించి వారి దగ్గర ఉన్న బంగారం, డబ్బును దోచుకునేవాడు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించేవాడు.
Read Also : Vicky : రెండు సార్లు జైలుకు వెళ్లిన విక్కికౌశల్..కారణం ఇదే !

ఇలా రెండు రాష్ట్రాల్లో జనవరి నుంచి ఏప్రిల్ వరకు దాదాపు 10 మంది దగ్గర దోచుకున్నాడు. శ్రీనివాస్ గతంలో భార్యను చంపేసి జైలు జీవితం కూడా గడిపి వచ్చాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఒంటరి మహిళలే టార్గెట్ గా దోచుకోవడం స్టార్ట్ చేశారు. వరుసగా ఆయన మీద కేసులు నమోదు కావడంతో పోలీసులు పట్టుకోవడానికి నానా ప్రయత్నాలు చేశారు. కానీ నిత్యం అడ్రస్ మారుస్తూ, ఫోన్ నెంబర్లు, ఐడెంటిటీ, పేరు మారుస్తూ వస్తున్నాడు. శివ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు గత నెల రోజులుగా తీవ్రంగా శ్రమించి చివరకు పట్టుకున్నారు.
Read Also : NANI : హిట్ – 3వ రోజు.. హౌస్ ఫుల్స్.. మొత్తం కలెక్షన్స్ ఎంతంటే.?

Exit mobile version