Site icon NTV Telugu

Road Accidents: మృత్యుగడియాలు.. ఈ సమయంలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు..

Road Accidents

Road Accidents

మితిమీరిన వేగం కొన్నిసార్లు.. నిర్లక్ష్యం మరికొన్నిసార్లు.. ఎంతోమందిని రోడ్డు ప్రమాదాల రూపంలో పొట్టనబెట్టుకుంటూనే ఉంది… భారత్‌లో ప్రతీ గంటకు సగటున 50 మంది రోడ్డుప్రమాదాల్లో ప్రాణాలుపోగొట్టుకుంటున్నట్లు నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదికలు చెబుతున్నాయి… 2021లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై తాజాగా నివేదిక విడుదల చేసింది ఎన్సీఆర్బీ.. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 4 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.. అయితే, ఏ సమయంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా నివేదికలో పేర్కొంది.. అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య జరిగాయి.. గత ఏడాది ఈ సమయంలోనే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు విడిచారని ఎన్సీఆర్బీ 2021 నివేదిక పేర్కొంది.

Read Also: Gold Rates Today: ఈ రోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

భారత్‌లో ప్రతీ రోజు 24 గంటల వ్యవధిలో జరిగే రోడ్డు ప్రమాదాలను విశ్లేషించిన ఎన్సీఆర్బీ నివేదిక.. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య 81,410 మంది ఒకే ఏడాదిలో మృత్యువాతపడినట్టు పేర్కొంది. ఇక, ఆ తర్వాత స్థానం మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు జరిగిన ప్రమాదాల్లో 71,711 మంది ప్రాణాలు విడిచారు. అయితే, సాయంత్రం సమయంలో ప్రమాదాలకు సంబంధించిన పరిస్థితులను కూడా ఆ నివేదిక పేర్కొంది.. సాయంత్రం 6 గంటల నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం.. క్రమంగా వెలుతురు తగ్గడమే ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్పుకొచ్చింది.. ఇక, డ్రైవర్ల అలసట కూడా రోడ్డు ప్రమాదాలకు మరో కారణంగా పేర్కొంది.. అయితే, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య ట్రాఫిక్‌ తక్కువగా ఉండటంతో.. అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది ఎన్సీఆర్బీ 2021 నివేదిక.

Exit mobile version