NTV Telugu Site icon

Bhopal: ఘోరం.. వాటర్ ట్యాంక్‌లో బాలిక మృతదేహం.. హత్యాచారం జరిగినట్లుగా అనుమానం!

Bhopal

Bhopal

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఐదేళ్ల బాలిక కేసు విషాదంగా మారింది. చిన్నారి నివసిస్తున్న ఇంటికి ఎదురుగా ఉన్న వాటర్‌ ట్యాంక్‌లో శవమై కనిపించింది. చిన్నారి హత్యాచారాకి గురైనట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇది కూడా చదవండి: Indra Sena Reddy: త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డికి మిజోరం గవర్నర్‌గా అదనపు బాధ్యతలు

మూడు రోజుల క్రితం చిన్నారి అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌లు, డ్రోన్‌లతో పాటు ఐదు పోలీసు స్టేషన్‌ల నుంచి 100 మంది పోలీసులు రంగంలోకి దిగారు. బృందాలుగా విడిపోయి చిన్నారి కోసం గాలించారు. ప్రతి ఇల్లును అణువణువునా పరిశీలించారు. 1000 ఫ్లాట్‌ల్లో ఉండే వాషింగ్ మిషన్లు కూడా తనిఖీ చేశారు. ఎక్కడా కనిపించలేదు. తీరా ఇంటి ఎదురు నుంచి దుర్వాసన రావడంతో 72 గంటల తర్వాత చిన్నారి హత్యాచారానికి గురైనట్లుగా పోలీసులు కనుగొన్నారు.

ఇది కూడా చదవండి: Israel video released: వామ్మో.. ఈ వీడియో చూస్తే హిజ్బుల్లాకు నిద్రపట్టదేమో..!

పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి నివసిస్తున్న ఇల్లు.. నిర్మానుష్యంగా ఉన్న మరో ఇంట్లో ఎందుకు తనిఖీలు చేయాలని మండిపడుతున్నారు. ప్రజలు రోడ్లు దిగ్బంధించి నిరసన తెలిపారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఆందోళన చేపట్టింది. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సీనియర్ పోలీసు అధికారి షాలినీ దీక్షిత్ మాట్లాడుతూ.. విచారణ కొనసాగుతోందని తెలిపారు. ప్రతి కోణాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. హత్యను తోసిపుచ్చలేమని.. దర్యాప్తు పురోగతిలో ఉన్నందున కారణాలను వెలికితీస్తామని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Vijayasai Reddy vs Atchannaidu: అచ్చెన్నాయుడుపై విజయసాయిరెడ్డి కీలక ట్వీట్..