Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..

  • మీరట్ స్నేక్ మర్డర్ కేసులో కోర్టు సంచలన తీర్పు..
  • భర్తను చంపిన భార్య, ఆమె లవర్‌కు ఉరిశిక్ష విధింపు..
  • అత్యంత అరుదైన కేసుగా పరిగణించిన న్యాయస్థానం..
Meerut Murder Case

Meerut Murder Case

Meerut Murder Case: మీరట్‌లో స్నేక్ మర్డర్ కేసులో మీరట్ కోర్టు సంచనల తీర్పు వెలువరించింది. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి కోర్టు ‘‘ఉరిశిక్ష’’ విధించింది. భార్య రవిత, ఆమె పొరుగింటి వ్యక్తి అమర్‌దీప్‌ కలిసి భర్త అమిత్ కశ్యప్‌ను గొంతు నులిమి హత్య చేశారు. హత్య, నేరపూరిత కుట్ర కేసుల్లో అక్టోబర్ 07న కోర్టు ఇద్దర్ని దోషులుగా నిర్ధారించింది. తాజాగా శుక్రవారం శిక్షను ఖరారు చేసింది. ‘‘అత్యంత అరుదైన కేసు’’గా పరిగణించిన కోర్టు మరణశిక్షను విధించింది.

పాము కాటుగా డ్రామా..

ఉత్తర్ ప్రదేశ్‌లో మీరట్ జిల్లాలోని అక్బర్‌పూర్ సాదత్ గ్రామంలో 2025 ఏప్రిల్ 12న అమిత్ కశ్యప్ అలియాస్ మిక్కీ తన ఇంట్లో మరణించి కనిపించాడు. అతడి మృతదేహం కింద పాము కనిపించింది. దీంతో తొలుత కుటుంబం ఇది పాము కాటు వల్ల సంభవించిన మరణంగా భావించింది. నిందితులు ఇద్దరు దీనిని సహజం మరణంగా చూపించేందుకు మృతదేహం కింద పామును ఉంచినట్లు విచారణలో తేలింది. ఆ పాము కూడా విషరహితమైందిగా వెల్లడైంది.

అమిత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో పాము కాటుతో మరణించలేదని, గొంతు నులిమి ఊపిరాడక మరణించినట్లు తేలింది. దీనిని హత్య నమోదు చేసిన పోలీసులు భార్య రవిత, లవర్ అమర్‌దీప్‌లను అరెస్ట్ చేశారు.

సతీ సావిత్రిని ప్రస్తావించిన కోర్టు..

ఈ కేసులో పోలీసులు 500 పేజీలకు పైగా ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొబైల్ ఫోన్ రికార్డులు, పోస్టుమార్టం నివేదిక ఆధారాలు కేసులో కీలకంగా మారాయి. అమిత్ మరణానికి ముందు నిందితులిద్దరరూ ఏకంగా నాలుగు రోజుల్లో 70కి సార్లకు పైగా మాట్లాడుకున్నట్లు వెల్లడైంది.

శిక్ష ఖరారు చేసే సందర్భంలో న్యాయమూర్తి భార్య భర్తకు అర్ధాంగి అని, తన భర్త ప్రాణాలు కాపాడేందుకు యముడితో పోరాడిన సావిత్ర కథను గుర్తుచేశారు. ఈ కేసులో నిందితులు ముందస్తు ప్రణాళికతో హత్య చేయడం, దాన్ని పాము కాటుగా చిత్రీకరించడం దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేసినట్లు కోర్టు గుర్తంచింది. నిందితులకు మరణశిక్ష విధించడంతో మృతుడు తల్లి ఆనందం వ్యక్తం చేశారు. మొదటి నుంచి అమిత్ కుటుంబం నిందితులకు మరణశిక్ష విధించాలని కోరుతున్నారు.