Site icon NTV Telugu

Meerpet Constable: కానిస్టేబుల్ కామక్రీడ.. కేసు పెట్టిన యువతి న్యూడ్ వీడియోలను

Crime

Crime

Meerpet Constable: బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నాడు.. నలుగురికి కష్టం వస్తే తీర్చాల్సిన వాడు.. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన వాడు.. గాడి తప్పాడు. ఎలాంటి పని అయితే చేయకూడదో అదేపని చేసి అతని వృత్తికే మాయని మచ్చ తెచ్చాడు. రక్షణ కల్పించే రక్షక భటులే తప్పుచేస్తారని ప్రజల మనస్సులో మరింత అపవాదును తీసుకొచ్చాడు ఈ కీచకుడు. అసలు ఇతను ఏం చేశాడు అనేగా.. పోలీస్ కానిస్టేబుల్ అయ్యి ఉండి కామాక్రీడలకు అలవాటు పడి యువతులను వేధిస్తున్నాడు. ఇటీవల ఒక యువతిపై బలవంతంగా అత్యాచారం చేసి జైలుకు కూడా వెళ్ళాడు. అయినా అతడి పొగరు దిగలేదు. తనపై కేసు పెట్టిన యువతిని కేసు వాపస్ తీసుకోవాలని బెదిరించడం మొదలుపెట్టాడు. చివరికి కేసు వాపస్ తీసుకోకపోతే ఆమె న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు..అతను హైదరాబాద్ కు చెందిన కానిస్టేబుల్ కావడం గమనార్హం.

సైదాబాద్​కు చెందిన పి.వెంకటేశ్వర్​ రావు (37) స్పెషల్​ బ్రాంచి కానిస్టేబుల్​ గా పనిచేస్తున్నాడు. అతని భార్య గత కొన్నేళ్ళక్రితం అనారోగ్యంతో మృతిచెందింది. అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహిత (34)తో పరిచయం చేసుకున్నాడు. ఆమెను వెంటపడి వేధించడం మొదలు పెట్టాడు. 2021లో సైదాబాద్​లో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి చొరబడి అసభ్యకరంగా ప్రవర్తించడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్​పై ఆమె సైదాబాద్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీంతో వెంకటేశ్వర్​ రావు పై ఐపిసి 324 సెక్షన్​ కింద కేసులు నమోదు చేసిన సైదాబాద్​ పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. కేసు నమోదు కావడంతో వెంటనే ఉన్నతాధికారులు అతనిపై సస్పెన్షన్​ వేటు వేశారు. జైలు నుంచి వెళ్లి వచ్చిన అనంతరం కానిస్టేబుల్​ వెంకటేశ్వర్​రావు తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని వేధించసాగాడు. ఆమె సైదాబాద్​ను జిల్లెల్​గూడలో మకాం మార్చినప్పటికీ వెంటపడుతున్నాడు. అక్టోబర్​ 17,18,19వ తేదీలలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు. అత్యాచార సమయంలో తీసుకున్న కొన్ని న్యూడ్​ వీడియోలు వెంటనే సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తానని, తనపై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని బెదిరించసాగాడు. ఈ నెల 11వ తేదీన కూడా మరో మారు సదరు కానిస్టేబుల్​ ఆమెపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో బాధితురాలు మీర్​పేట్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచార కేసును నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి నుంచితప్పించుకుతిరుగుతున్న స్పెషల్​ బ్రాంచి కానిస్టేబుల్​ వెంకటేశ్వర్​రావును ఈ నెల 14వ తేదీన మీర్​పేట్​ పోలీసులు అరెస్ట్​ చేసి, రిమాండ్​కు తరలించారు. ఈ కేసును మీర్​పేట్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version