Site icon NTV Telugu

POCSO : ‘స్నేహం’గా మొదలై దారుణంగా మారిన కథ.!

POCSO : హైదరాబాద్‌లో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. దత్తత తీసుకున్న తల్లి చనిపోవడం, తండ్రి అనారోగ్యంతో మంచాన పడి.. మైనర్ బాలిక ఒంటరిగా ఉంటోందని గమనించిన యువకుడు ఆమెను ట్రాప్ చేశాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని దగ్గరయ్యాడు. ఏకంగా ఆమె ఇంట్లో సహజీవనం చేయడం ప్రారంభించాడు. కానీ బాలిక అసలు తల్లికి విషయం తెలియడంతో యువకుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు రవితేజ. మేడ్చల్ జిల్లా అలియాబాద్‌లో ఉంటున్నాడు. మేడిపల్లిలోని ఓ మైనర్ బాలికను ట్రాప్ చేశాడు…

Hyderabad: నగరం నడిబొడ్డులో పట్ట పగలే హత్య.. కత్తులతో దారుణంగా నరికి…

వాయిస్: నిజానికి మైనర్ బాలికను ఆమె తల్లి.. తన అక్క, బావకు దత్తత ఇచ్చింది. ఐతే ఇటీవలే పెంపుడు తల్లి చనిపోయింది. తర్వాత పెంపుడు తండ్రి సైతం మంచాన పడ్డాడు. దీంతో బాలిక స్కూలుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. బాలిక పరిస్థితిని గమనించిన రవితేజ.. ఆమెకు స్నాప్ చాట్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా దగ్గరయ్యాడు. బాలిక ఒంటరిగా ఉండడంతో ఈజీగా స్నేహం పెంచుకున్నాడు. ఆమె దుర్భర పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆప్యాయంగా మాట్లాడి లోబర్చుకున్నాడు. రవితేజపై నమ్మకంతో బాలిక అతడికి దగ్గరైంది. ఈ క్రమంలో గత రెండు నెలలుగా రవితేజ.. బాలిక ఇంట్లోనే ఆమెతో సహజీవనం చేయడం ప్రారంభించాడు…

కొంత కాలం బాగానే నడిచింది. కానీ బాలిక అసలు తల్లి రావడంతో విషయం బయట పడింది. పెంపుడు తండ్రి అనారోగ్యం గురించి తెలుసుకుని.. బాలికను పరామర్శించడానికి వచ్చింది సొంత తల్లి. అక్కడ రవితేజను షాక్‌కు గురైంది. కూతురు మైనర్ అయినప్పటికీ, రవితేజ ఆమెతో సహజీవనం చేస్తున్నాడన్న విషయం తెలిసి ఆందోళన చెందింది. వెంటనే ఈ విషయంపై కూతురిని ప్రశ్నించింది. జరిగిన దారుణాన్ని ఆమె వివరించింది. దీంతో ఆగ్రహం చెందిన తల్లి.. మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని రవితేజను అదుపులోకి తీసుకున్నారు…

మైనర్ బాలికతో సహజీవనం చేయడమే కాకుండా.. ఆమెను లైంగికంగా వేధించాడని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో పోలీసులు రవితేజపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు. బాలికను కౌన్సెలింగ్‌ కోసం పంపించారు… సోషల్ మీడియాలో పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా మైనర్ బాలికలు ఇలాంటి ట్రాప్‌లలో పడకుండా ఉండాలని పోలీసులు సూచించారు…

Hyderabad: పూటకోవేశం.. జనాలను చీట్ చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు..

Exit mobile version