Medical Students Ganja Case: నగరంలోని ప్రసిద్ధ మెడిసిటీ మెడికల్ కాలేజీ గంజాయి కేసు చుట్టూ సంచలన విషయాలు ఒక్కొటిగా బయటపడుతున్నాయి. మూడు సంవత్సరాలుగా మెడికోల్లో గంజాయి వినియోగం నానాటికీ పెరిగిపోతుండగా, తాజాగా ఈగల్ టీం జరిపిన దర్యాప్తులో ఈ వ్యవహారం మరింత లోతుగా ఉన్నట్లు స్పష్టమైంది. ఈగల్ టీం అందించిన సమాచారం ప్రకారం, ఈ కాలేజీలో దాదాపు వందమందికిపైగా మెడికోలు గంజాయి వాడుతున్నట్లు గుర్తించబడింది. అందులో 32 మంది మెడికోలు గత ఏడాది నుంచి రెగ్యులర్‌గా గంజాయి తీసుకుంటున్నట్టు ఆధారాలు లభించాయి.
Visakhapatnam Port Authority: విశాఖపట్నం పోర్ట్ మరో ఘనత.. భారత్‌లోనే ప్రథమ స్థానం..
మరికొన్ని షాకింగ్ వివరాల్లో, సీనియర్ విద్యార్థులే జూనియర్లకు గంజాయి అలవాటు చేసి, వారినే వాడుకుని డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్లు తేలింది. గంజాయి కోసం ఈ విద్యార్థులు తరచుగా క్యాంపస్ వదిలి సికింద్రాబాద్ వెళ్లి డ్రగ్స్ తెచ్చుకున్నట్లు ఈగల్ టీం తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డ్రగ్ పెడ్లర్ అరాఫత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యక్తి మెడిసిటీ సహా పలు కాలేజీలకు గంజాయి సరఫరా చేస్తున్నాడని తెలుస్తోంది. అరాఫత్, కర్ణాటకలోని బీదర్‌కు చెందిన జరీనా అనే మహిళ నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నాడని ఈగల్ టీం గుర్తించింది.
జరీనాను కూడా అరెస్టు చేసిన పోలీసులు ఆమె వద్ద నుంచి ఆశ్చర్యకర విషయాలను వెలికితీశారు. ఆమె గత సంవత్సరం నుంచి సుమారు ₹1.5 కోట్ల విలువైన గంజాయి అమ్మి సంపాదించిందని, హైదరాబాద్ నగరంలో 51 మంది సభ్యులతో కూడిన పెద్ద డ్రగ్ నెట్‌వర్క్ను నడుపుతోందని సమాచారం. జరీనా తన ముఠాలోని డ్రగ్ పెడ్లర్లను ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజీల విద్యార్థులను టార్గెట్ చేసి, వారిలో డ్రగ్స్ అలవాటు చేయడానికి ఉపయోగించిందని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ నెట్‌వర్క్ మొత్తం మీద దృష్టి సారించగా, ఇంకా కొందరు విద్యార్థులు, పెడ్లర్లను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Jagga Reddy : లక్ష కోట్లలో 30% తినేసి.. హరీష్ రావు ప్రాజెక్టు దగ్గర పడుకున్నాడు
