Site icon NTV Telugu

Medha School : బోయినపల్లి డ్రగ్ కేసులో సంచలన విషయాలు తెరపైకి

Medha School

Medha School

Medha School : హైదరాబాద్ బోయినపల్లి మేధా స్కూల్‌లో వెలుగులోకి వచ్చిన డ్రగ్ తయారీ కేసు సంచలనంగా మారింది. ఈగిల్ టీమ్ నిర్వహించిన సోదాల్లో స్కూల్‌ లోపలే అల్ప్రాజొలామ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసిన విషయం బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మేధా స్కూల్ యజమాని మలేలా జయప్రకాశ్ గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను మహబూబ్‌నగర్ జిల్లా బుతుపూర్‌కు అల్ప్రాజొలామ్ సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. మొత్తం 3.5 కిలోల అల్ప్రాజొలామ్‌తో పాటు కిలోల సగం తయారీకి ఉపయోగించే డ్రగ్ సిస్‌ను ఈగిల్ టీమ్ స్వాధీనం చేసుకుంది.

Asia Cup 2025 : ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌కి ఇంకా టికెట్లు అమ్ముడుపోకపోవడం షాక్!

డ్రగ్ రాకెట్‌లో జయప్రకాశ్ గౌడ్‌తో పాటు శేఖర్, గురువా రెడ్డి పాత్రపై కూడా ఈగిల్ టీమ్ దర్యాప్తు కొనసాగిస్తోంది. గురువా రెడ్డి అందించిన ఫార్ములాతోనే జయప్రకాశ్ స్కూల్‌లో డ్రగ్ యూనిట్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో విద్యాశాఖ మేధా స్కూల్ లైసెన్స్‌ను రద్దు చేసింది. స్కూల్‌ సీజ్‌ చేయబడగా, ప్రస్తుతం అక్కడ చదువుతున్న విద్యార్థులను మరో స్కూల్‌లో చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 10 కిలోలకుపైగా అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌ను స్కూల్‌లోనే తయారు చేసి విక్రయించినట్లు అధికారులు గుర్తించారు.

Telangana : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ గ్యాంగ్స్‌పై పోలీసుల దాడులు ఈగల్‌, GRP & RPF సంయుక్త ఆపరేషన్

Exit mobile version